వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఎస్ఈ 10 పరీక్షలు జులై 1 నుంచి, 12 పరీక్ష జులై 9, షెడ్యూల్ ఇదే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా సీబీఎస్ఈ విడుదల చేసింది. జులై 1 నుంచి 15వ తేదీల మధ్యన ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. పరీక్షలను ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Recommended Video

CBSE Class 10, 12 Exam Schedule, Check Out Date Sheet| Guidelines For Students

కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసా?కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసా?

సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను జులై 1, 2, 10, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇక 12వతరగతి బిజినెస్ స్టడీస్ పేపర్ జులై 9న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం cbse.nic.in సంప్రదించవచ్చు.

CBSE Date Sheet 2020: 10th Exams from July 1st, 12th Business Studies on July 9

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తన ట్విట్టర్ ఖాతాలో పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. 9వ తరగతి, 11వ తరగతి ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం మరోసారి పరీక్షల నిర్వహించేందుకు కూడా సీబీఎస్ఈ ఏర్పాట్లు చేస్తోంది. వీరికి కూడా త్వరలోనే పరీక్షలు నిర్వహించనుంది.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్‌ను తెచ్చుకోవాలని సీబీఎస్ఈ సూచించింది. పరీక్ష హాలులోకి వచ్చిన తర్వాత
ప్రతి విద్యార్థి ఫిజికల్ డిస్టాన్స్ పా టించాలని స్పష్టం చేసింది. ప్రతి విద్యార్థి ముక్కును, నోటిన మాస్కుతో కవర్ చేసుకోవాలని సూచించింది. బోర్టు పెట్టిన నియమాలను ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

English summary
CBSE Date Sheet 2020 Released, 10th Exams on July 1, 2, 10 and 15 - 12th Business Studies on July 9.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X