వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఎస్ఈ ప్రశ్న పత్రాల లీక్: ఆ రెండు పేపర్లకు మళ్లీ పరీక్షలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పదో తరగతి లెక్కలు, పన్నెండో తరగతి ఎకనమిక్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సిబిఎస్ఈ నిర్ణయించింది. ఆ సబ్జెక్టులకు సంబంధించిన ఆ రెండు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకుంది.

కొన్ని పరీక్షల నిర్వహణలో జరిగిన సంఘటనలను బోర్డు పరిగణనలోకి తీసుకుని బోర్డు పరీక్షల పవిత్రతను కాపాడేందుకు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆ సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

 CBSE Declares Re-Exam For Class 10 Maths, Class 12 Economics

ఆ పరీక్షలు జరిగే తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని సిబిఎస్ఈ తెలిపింది. ఓ వారంలో వివరాలను సిబిఎస్ఈ వెబ్‌సైట్‌లో పెడుతామని కూడా తెలిపింది. పదో తరగతి లెక్కల పరీక్ష ఈ రోజు జరగగా, పన్నెండో తరగతి ఎకనమక్స్ పరీక్ష సోమవారంనాడు జరిగింది.

పరీక్షకు ఒక రోజు ముందే పన్నెండో తరగతి ఎకనమిక్స్ పరీక్ష ప్రశ్న పత్రం చేతి రాతలో వాట్సప్‌లో పంపిణీ అయింది. అందులోని చాలా ప్రశ్నలు బోర్డు ఇచ్చిన ప్రశ్న పత్రంలో కనిపించాయి.

English summary
Education body CBSE will conduct re-examination for the Class X Maths and Class XII Economics papers amid reports that the question papers had leaked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X