వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఎస్ఈ పరీక్షల తేదీలు ఖరారు: ఎప్పట్నుంచంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం ప్రకటించింది. 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణఫై గురువారం స్పష్టతనిచ్చింది.

 చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..? చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..?

జులై 1 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కొత్త షెడ్యూల్‌ను సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అందుకే విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ తనిఖీ చేస్తూ ఉండాలని కోరింది.

CBSE new exam dates for Class 10th, 12th released: Exams from July 1-15

విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇచ్చేందుకే పరీక్షలను జులైలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించిన 29 పేపర్ల పరీక్షల్ని నిర్వహించాల్సి ఉంది. పరీక్షల సమాచారం కోసం http://cbse.nic.in/ వెబ్‌సైట్ సంప్రదించవచ్చు.

కరోనా లాక్ డౌన్ వల్ల దేశంలోని దాదాపు అన్ని పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మనదేశంలో మే 17 వరకు లాక్ డౌన్ విధించింది కేంద్రం. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం పలు సడలింపులను ప్రకటించింది. కాగా, సీబీఎస్ఈ పరీక్షల 2021 సిలబస్‌ను తగ్గించే ఆలోచనలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉన్నట్లు సమాచారం.

English summary
CBSE new exam dates: The much awaited decision has now arrived. The dates for pending CBSE board exams have been announced today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X