వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఎస్ఈ పేపర్ లీక్‌పై ఫిర్యాదు: వెనక ఓ టీచర్, రెండు స్కూల్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రశ్న పత్రాల లీక్ వెనక ఉన్న ఓ వ్యక్తి పేరుతో కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సిబిఎస్ఈ) ఓ వ్యక్తి పేరును చెప్పింది. ఢిల్లీలోని రాజిందర్ నగర్‌లో కోచింగ్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్న ఓవ్యక్తి పేరు చెబుతూ తమకు మార్చి 23వ తేదీన ఓ ఫాక్స్ సమాచారం వచ్చిందని సిబిఎస్ఈ పోలీసులకు చెప్పింది.

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తమకు ఫాక్స్ వచ్చిందని, పేపర్ లీక్‌తో సంబంధం ఉన్న రెండు స్కూళ్ల పేర్లు కూడా అందులో తెలియజేశారని సిబిఎస్ఈ పోలీసులకు రాసిన లేఖలో తెలిపింది.

ప్రశ్న పత్రాలను పంపిణీ చేసిన వాట్సప్ నెంబర్‌ను కూడా సిబిఎస్ఈ చెప్పినట్లు సమాచారం. వాట్సప్‌లో అందిన ఫిర్యాదును మార్చి 24వ తేదీన తాము సిబిఎస్ఈ ఢిల్లీ ప్రాంతీయ కార్యాలయానికి పంపించామని సిబిఎస్ఈ ఆ లేఖలో తెలిపింది.

సిబిఎస్ఈ ప్రశ్న పత్రాల లీక్‌పై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ కేసులో కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను ఆదేశించారు.

చేతిరాతలోని లీకైన ప్రశ్నపత్రం స్నాప్‌షాట్‌ను పోలీసులు తీసుకున్నారు. అదే వాట్సప్‌లో పంపిణీ అయింది. వాట్సప్ మెసేజ్‌ల సోర్స్‌ను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఎండ్ -టు - ఎండ్ ఎంక్రిప్షన్ వల్ల గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. పోలీసులు విచారించిన 25 మందిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నారు. వారికి లీకైన ప్రశ్నపత్రం అందినట్లు తెలుస్తోంది.

లీకైన ఎకనమిక్స్ పేపర్ వాట్సప్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అయింది. పరీక్షకు కొన్ని గంటల ముందే అది అందుబాటులోకి వచ్చింది. ఎకనమిక్స్ పరీక్ష సోమవారంనాడు జరిగింది.

English summary
CBSE papers leak: Board shares anonymous fax naming 1 teacher, 2 schools with Delhi Police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X