వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10,12వ తరగతి పాస్ మార్కుల్లో మార్పులు: కొత్త విధానం ప్రవేశ పెట్టిన CBSE

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ సెంకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకణలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. కొత్తగా తీసుకువచ్చిన మార్పులకు సంబంధించిన జాబితాను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. రివైజ్డ్ లిస్టు ప్రకారం 10వ తరగతి 12వ తరగతి విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రతి సెక్షన్‌లో పాస్‌ మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుందనే కొత్త మార్పును ప్రవేశపెట్టింది. ప్రతి సబ్జెక్టులో రెండు లేదా మూడు అసెస్‌మెంట్ విభాగాలు ఉంటాయి. ఇవి థియరీ, ప్రాక్టీస్ లేదా ప్రాజెక్టు లేదా ఇంటర్నల్ అసెస్‌మెంట్ అని ఉంటయి. ఈ సెక్షన్లలో అన్నిటిలో ఇకపై విద్యార్థులు పాస్ మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.

కొత్త మార్పులకు అనుగుణంగా ప్రతి పేపర్‌లో 10వ తరగతి మరియు 12వ తరగతి విద్యార్థులు ప్రతి సెక్షన్‌లో 33 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుందని సీబీఎస్‌ఈ విడుదల చేసిన సర్క్యులర్‌లో పొందుపర్చింది. 10వ తరగతి మరియు 12వ తరగతి సీబీఎస్ఈ సిలబస్‌లో ప్రతి సబ్జెక్టుకు ప్రాక్టికల్ మరియు థియరీ విధానాలు ఉంటాయి. ప్రాక్టికల్ పేపర్‌కు 20 మార్కులు కేటాయించగా... థియరీ పేపర్ 80 మార్కులకు ఉంటుంది. కొత్తగా తీసుకువచ్చిన 33శాతం నిబంధన ప్రకారం థియరీ విభాగంలో విద్యార్థి 26 మార్కులు, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ విభాగంలో 20 మార్కులకు గాను 6 మార్కులు పొందాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ప్రాజెక్టు విభాగంకు కూడా ఆరుమార్కులు తప్పనిసరిగా తెచ్చుకోవాలంటూ సీబీఎస్ఈ వివరించింది.

CBSE revises pass marks for 10th and 12th class,Revised list released

ఇదిలా ఉంటే 30 మార్కులున్న ప్రాక్టికల్ సబ్జెక్టులో ఎలాంటి మార్కులు సాధించకపోయినప్పటికీ థియరీ సబ్జెక్టులో 70 మార్కులకుగాను 23 మార్కులు తప్పనిసరిగా సాధించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇక 2019లో 10వ తరగతి పాసైన విద్యార్థుల్లో 2,25,143 మంది విద్యార్థులు 90శాతంకు పైగా మార్కులు సాధించగా 57,256 మంది విద్యార్థులు 95శాతం అంతకన్నా ఎక్కువగా మార్కులు సాధించారు. మొత్తం పాస్ శాతం 91.1గా ఉన్నింది. 2018 కంటే ఈ సారి పాస్ శాతం 4.40 శాతం ఎక్కువగా నమోదైంది. 500 మార్కులకు గాను 13 మంది విద్యార్థులు 499 మార్కులు సాధించడం విశేషం. 2019 12వ తరగతి ఫలితాలు చూస్తే మొత్తం ఉత్తీర్ణత శాతం 83.4శాతంగా ఉండగా.. ఇద్దరు విద్యార్థులు 500 మార్కులకుగాను 499 మార్కులు సాధించి టాపర్స్‌గా నిలిచారు.
English summary
Students studying in class 10 and class 12 will now have to clear each component separately by obtaining 33 per cent marks in each of them, the latest CBSE circular said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X