వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాంకేతిక విప్లవం : 2 రూపాయలకే ఇంటర్నెట్.. సీడాట్ ప్రకటన

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎమర్జెన్సీలో ఇంటర్నెట్ అయిపోయిందా..! అయినా నో ప్రాబ్లమ్ : 2 రూపాయలకే డాటా | Oneindia Telugu

బెంగళూరు : టెక్నాలజీ పెరిగింది. అరచేతిలో ప్రపంచం చూస్తున్నాము. ఒకప్పుడు పెద్దోళ్లకే పరిమితమైన ఇంటర్నెట్ సేవలు రానురాను సగటు మనిషికి కూడా అందుబాటులోకి వచ్చాయి. గ్రామగ్రామాన నెట్ హల్ చల్ చేస్తోంది. అయితే ఇంటర్నెట్ ప్రొవైడర్ల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో డాటా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈనేపథ్యంలో మరో అడుగు ముందుకేసి 2 రూపాయలకే డాటా అందిస్తున్నట్లు ప్రకటించింది సీడాట్ (సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్ టెలిమ్యాటిక్స్‌) సంస్థ.

2 నుంచి 20 రూపాయల దాకా..!

2 నుంచి 20 రూపాయల దాకా..!

ఇంటర్నెట్ సేవలు గ్రామాగ్రామానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీడాట్ సంస్థ రెండు రూపాయలకే డాటా అందించడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థ డెవలప్ చేసిన పీడీఓ (Public Data Office) వ్యవస్థ ద్వారా అతి తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. 2 రూపాయలు మొదలు 20 రూపాయల వరకు వివిధ ప్లాన్లలో డాటా అందేలా రూపకల్పన చేశారు. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు టెక్ సమ్మేళనంలో ప్రకటించింది సీడాట్ సంస్థ.

ఎమర్జెన్సీలో ఇంటర్నెట్ అయిపోయిందా..! ఇక నో ప్రాబ్లమ్

ఎమర్జెన్సీలో ఇంటర్నెట్ అయిపోయిందా..! ఇక నో ప్రాబ్లమ్

మీ ఫోన్ లో డాటా అయిపోయిందా? అత్యవసరంగా ఇంటర్నెట్ అవసరమైందా? రీఛార్జ్ చేయించుకుందామంటే షాపులు తెరవలేదా? ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవంటోంది సీడాట్. మీకు ఎమర్జెన్సీలో డాటా కావాలంటే కేవలం 2 రూపాయలకే అందించనుంది. ఈ సేవలు త్వరలోనే గ్రామగ్రామానికి విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న పీఈఓ (Public Electronic Office) వ్యవస్థ ద్వారా డాటా సేవలు పొందే వీలుంది.

 కాయిన్ బాక్స్.. సింపుల్ టెక్నాలజీ

కాయిన్ బాక్స్.. సింపుల్ టెక్నాలజీ

కాయిన్ బాక్స్ లాంటి యంత్రంలో 2 రూపాయల బిళ్ల వేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో సదరు మొబైల్ కు ఓటీపీ వస్తుంది. అది ఆ మిషన్ లో ఫీడ్ చేయగానే వెంటనే డాటా సేవలు అందుబాటులోకి వస్తాయి. సింపుల్ టెక్నాలజీతో త్వరగా ఇంటర్నెట్ సేవలందుతాయన్నమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో
నెట్‌వర్క్‌ సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించడంతో పాటు తక్కువ ధరలకే డాటా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది సీడాట్ సంస్థ.

అత్యవసర సమయాల్లో ది బెస్ట్

అత్యవసర సమయాల్లో ది బెస్ట్

అత్యవసర సమయాల్లో మొబైల్ డాటా అయిపోతే ఆ బాధ వర్ణనాతీతం. మెయిల్స్ పంపడమో, వాట్సప్ షేర్ చేయడమో ఇలా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇంటర్నెట్ సేవలు లేకుండా వచ్చే చిరాకు అంతా ఇంతా కాదు. అయితే సీడాట్ అందించనున్న "2 రూపాయలకే డాటా" కొంతమేర ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టే ఛాన్సుంది. పీఈఓ (Public Electronic Office) కాయిన్ బాక్స్ లాంటి యంత్రాల్లో రెండు రూపాయల బిళ్ల వేయగానే వెంటనే ఇంటర్నెట్ సౌకర్యం పొందే వీలుంటుంది. దాదాపు వీటిని ఎటీఎం మిషన్లలాగా అన్నిచోట్ల పెడతారని తెలుస్తోంది.

English summary
The public sector company CDOT will provide internet services for two rupees. The details of this are announced in the Bangalore Tech Summit. Mobile Data is the lowest price through the Public Data Office system developed by the company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X