సీడీఎస్ కు నివాళి.!రావత్ పరాక్రమం.!దేశాన్ని రక్షించడంలో బిపిన్ ది ప్రత్యేక వ్యూహమన్న బండి సంజయ్.!
ఢిల్లీ/హైదరాబాద్:
తమిళనాడులోని
కూనూరు
సమీపంలో
జరిగిన
ఆర్మీ
హెలికాప్టర్
దుర్ఘటన
పట్ల
బీజేపీ
రాష్ట్ర
అధ్యక్షులు,
ఎంపీ
బండి
సంజయ్
కుమార్
దిగ్బ్రాంతి
తెలయజేయమే
కాకుండా
బిపిన్
రావత్
బౌతిక
కాయానికి
నివాళులర్పించారు.
బిపిన్
రావత్
సతీమణి,
ఆర్మీ
అధికారులకు
సంతాపం
వ్యక్తం
చేసారు
బండి
సంజయ్.
మాతృభూమి
రక్షణ
కోసం
రావత్
చేసిన
సేవలు
ఎనలేనివి.
రావత్
మరణం
దేశానికి
తీరని
లోటని,
మరణించిన
వారి
కుటుంబ
సభ్యులకు
ప్రగాఢ
సానుభూతిని,
మృతుల
కుటుంబ
సభ్యులకు
మనోధైర్యం
కల్పించాలని,
ఈ
దుర్ఘటనలో
క్షతగాత్రుడై
చికిత్స
పొందుతున్న
అధికారి
త్వరగా
కోలుకోవాలని
ఆకాంక్షిన్నట్టు
బండి
సంజయ్
స్పష్టం
చేసారు.

త్రిదళాధిపతి రావత్ సాహసం అసామాన్యం.. రావత్ బౌతిక కాయానికి బండి సజయ్ నివాళి
హెలికాప్టర్ దుర్ఘటనలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల పార్థీవ దేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శ్రద్ధాంజలి ఘటించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డితో కలిసి బిపిన్ రావత్ నివాసానికి వెళ్లిన బండి సంజయ్ సీడీఎస్ రావత్ దంపతుల భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. జరిగిన దుర్ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు బండి సంజయ్.

రావత్ ఆత్మకు శాంతి చేకూరాలి.. సీడీఎస్ దంపతుల పార్ధివ దేహానికి పుష్పాంజలి ఘటించిన బండి సంజయ్
ఈ దుర్ఘటనలో అశువులు బాసిన వీర సైనికులకు బండి సంజయ్ ఘన నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ దుర్ఘటనలో దుర్మరణం పొందిన తెలుగు తేజం, రావత్ టీం సభ్యుడు బి.సాయితేజను ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. దేశ రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న బిపిన్ రావత్ గొప్ప వీరుడని, రావత్ తోపాటు గొప్ప దేశభక్తితో సేవలందిస్తున్న వీర సైనికులను కోల్పోవడం చాలా బాధాకరమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేసారు.

రావత్ సాహసోపేత చరిత్ర..ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయన్న సంజయ్
అంతే కాకుండా బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు అసామాన్యమని, శత్రు దేశాలనుండి భారత్ ను రక్షించే క్రమంలో ప్రత్యేక వ్యూహాన్ని కొనసాగిస్తూ సేవలందిస్తున్న వీర సైనికుడు బిపిన్ రావత్ అన్నారు. రావత్ ప్రతిభా పాటవాలు, సాహసాలు చూసి ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటున్నయన్నారు బండి సంజయ్. రావత్ వంటి దేశ భక్తులకు పునర్జన్మ ఇవ్వాలని తాను పూజించే అమ్మవారిని ప్రార్థిస్తున్నానని, రావత్ దేశభక్తిని, పరాక్రమ చరిత్రను, సాహసోపైత నిర్ణయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారి బాటలో నడవాలని కోరుకుంటున్నానని బండి సంజయ్ ఆకాంక్షించారు.
వీళ్లే వీర సైనికులు.. తెలుగు తేజం సాయితేజ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
ఇదిలా ఉడగా రావత్ తోపాటు వీరమరణం పొందిన వీర సైనికుల ఆత్మకు శాంతి చేకూర్చాలని అమ్మవారిని కోరుకుంటున్నానని, ఈ ఘటనలో దుర్మరణం పొందిన తెలుగు తేజం బి.సాయితేజ సేవలు చిరస్మరణీయమని, ఆ కుటుంబానికి నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నానని, ఈ విషాదం నుండి త్వరగా బయటపడేలా వీర సైనికుల కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందించాలని ఈ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు.