సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ క్రాష్: పైలట్ అయోమయంతో మేఘాల్లోకి, అందుకే ప్రమాదం
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. వాతావరణంలో చోటు చేసుకున్న అనుకోని మార్పులతోనే పైలట్ కొంత అయోమయానికి గురికావడం వల్లనే సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుందని, సాంకేతిక లోపం వల్ల కాదని కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ నిర్ధారించించి.
ఈ మేరకు ఎయిర్ మార్షల్ మాన్వేంద్ర సింగ్ నేతృత్వంలోని కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ విచారణ నివేదికలోని అంశాలను భారత వాయుసేన బహిర్గం చేసింది. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాలనూ పరిశీలించిన బృందం ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది.

లోయలోని వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పుల కారణంగా సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్లో మేఘాలలోకి ప్రవేశించింది. అక్కడి పరిస్థితులతో పైలట్ అయోమయానికి గురికావడంతో హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో మేఘాలలోకి వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఎలాంటి సాంకేతిక, యాంత్రిక తప్పిదాలు లేవు అని వాయుసేన నివేదికలో పేర్కొంది.
హెలికాప్టర్ ప్రమాదంపై నియమించిన విచారణ బృందం హెలికాప్టర్ డేటా రికార్డర్ తోపాటు, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను విశ్లేషించింది. దీంతోపాటే ప్రమాదం జరగడానికి కారణాలను తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న సాక్షులందరినీ ప్రశ్నించినట్లు వాయుసేన తెలిపింది. సాంకేతికత, యాంత్రిక కారణాల వల్ల ప్రమాదం జరిగిందనే ఆరోపణలను తోసిపుచ్చింది.
డిసెంబర్ 8, 2021లో భారత త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సీడీఎస్ దంపతులు సహా మొత్తం మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర వేదనకు గురిచేసింది.
జనరల్ రావత్ డిసెంబర్ 17, 2016 నుంచి డిసెంబర్ 31, 2019 వరకు భారత ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. ఆయన డిసెంబర్ 31, 2019న భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమితులయ్యారు. మధ్యప్రదేశ్‌లోని హహ్డోల్కు చెందిన మధులికా రావత్. సైనిక భార్యల సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు.