• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేర చరిత నేతలకు చుక్కలు -ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం -ఎన్నికల సంస్కరణలపై కేంద్రానికి సీఈసీ లేఖ

|

ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్ తీరుపై పెద్దఎత్తున విమర్శలు వస్తుండటం, కోర్టులు సైతం ఈసీని పరుష పదజాలంతో తిట్టిపోస్తున్న సందర్భంలో ఎన్నికల సంస్కరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చాలా కాలంగా పెడింగ్ లో ఉన్న ప్రతిపాదిత సంస్కరణలపై వేగంగా నిర్ణయాలు తీసుకోండంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర మంగళవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు.

viral video: అధ్యక్షుడి చెంప ఛెళ్లు -ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌‌కు ఘోర పరాభవంviral video: అధ్యక్షుడి చెంప ఛెళ్లు -ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌‌కు ఘోర పరాభవం

నేర చరిత్ర ఉన్న రాజకీయ నేతలకు మరింత షాకిచ్చేలా, ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చే వారికి జైలు శిక్షను మూడింతలు పెంచేలా ప్రతిపాదిత సంస్కరణలున్నాయి. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని రుజువైతే సదరు నేతలకు జైలుశిక్షను ప్రస్తుత ఆరు నెలల నుంచి రెండేండ్ల‌కు పెంచాలనే ప్రతిపాదనను, రెండేంళ్ల జైలుశిక్ష అనుభవించిన వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేండ్ల పాటు నిషేధించేలా చ‌ట్టంలో మార్పులు చేయాల‌నే ప్రతిపాదనను కేంద్రానికి రాసిన లేఖలో సీఈసీ పేర్కొన్నారు.

CEC Sushil Chandra writes to Centre on pending electoral reforms, asks expedited action

ఎన్నికల ప్రచారంలో ప్రలోభాల పర్వాన్ని అరికట్టేదిశగా.. ఓటర్లు ప్రభావితం కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రచారానికి చివరి రోజు, పోలింగ్ రోజున వార్తాపత్రికల్లో రాజకీయ ప్రకటనలపై నిషేధం విధించాలని న్యాయ మంత్రికి రాసిన లేఖలో సుశీల్ చంద్ర ప్రతిపాదించారు. ప్రస్తుతానికి పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే ఎన్నికల ప్రచార సామగ్రిని చూపకుండా నిరోధిస్తున్నారు. కానీ ప్రింట్ మీడియాను ప్ర‌జా ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 126 పరిధిలోకి తీసుకురావాలని కమిటీ ఇప్పుడు సిఫారసు చేసింది. అలాగే,

ట్విస్ట్: వ్యాక్సిన్ ధరలు కంపెనీల ఇష్టం -రాష్ట్రాలే ప్రైవేటుకు సరఫరా -44కోట్ల డోసులకు ఆర్డరిచ్చాం: కేంద్రం ట్విస్ట్: వ్యాక్సిన్ ధరలు కంపెనీల ఇష్టం -రాష్ట్రాలే ప్రైవేటుకు సరఫరా -44కోట్ల డోసులకు ఆర్డరిచ్చాం: కేంద్రం

  #ElectoralBonds Can be Issued From April 1 - Supreme Court

  ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించడం వ‌ల్ల దొంగ ఓట్ల‌ను నిరోధించ‌వ‌చ్చున‌ని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర త‌న లేఖ‌లో సూచించారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల లోక్‌స‌భలో ఒక స‌భ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా.. ఎన్నికల కమిషన్ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉన్న‌దని, దీనికి ఎన్నికల చట్టాల్లో సవరణ అవసరమని తెలిపార‌ని సీఈసీ పేర్కొన్నారు.

  English summary
  Chief Election Commissioner Sushil Chandra has written to Law Minister Ravi Shankar Prasad requesting for expedited action on the electoral reform proposals pending with the government, including the one which seeks an enhanced two-year jail term for those furnishing incorrect information in their poll affidavit.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X