గీతా ప్రెస్‌ను ఆదుకున్న అదానీ..మహాకుంభమేళలో విస్తరిస్తోన్న ఆధ్యాత్మికత ..!!
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళ కేవలం మూడు నదుల పవిత్ర సంగమం మాత్రమే కాదు.. నమ్మకం, విశ్వాసం, సంస్కృతి సేవ యొక్క గొప్ప సగమం కూడా. ఇక కోట్లమంది భక్తులు దర్శించుకునే ఈ పుణ్య కార్యక్రమం నిర్వహణలో ఎంతో మంది భాగస్వాములయ్యారు. ఇందులో అదానీ గ్రూప్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికత పెంపొందేలా అదానీ గ్రూప్ తమ వంతు పాత్ర పోషిస్తోంది.
గీతా ప్రెస్ పునరుద్ధరణ
భక్తులతో పాటు సామాన్య ప్రజలు కూడా మహాకుంభమేళను సందర్శిస్తున్నారు. వారిలో భక్తిని పెంపొందించేందుకు అదానీ గ్రూప్ సంస్థ నడుం బిగించింది. 1923లో గోరఖ్‌పూర్‌లో ప్రారంభించిన గీతా ప్రెస్‌కు ఘన చరిత్ర ఉంది. గత శతాబ్ద కాలంగా సనాతన సాహిత్యాన్ని ప్రజలకు చేరవేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా పవిత్ర గ్రంథాలు, భక్తి పుస్తకాలను గీతా ప్రెస్ ముద్రించి ప్రచురిస్తోంది.అయితే కాలక్రమంలో టెక్నాలజీ పెరగడంతో గీతా ప్రెస్‌కు సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీన్ని నడిపేందుకు శ్రమపడాల్సి వచ్చేది.భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించడంలో గీతా ప్రెస్ కీలక పాత్రను గుర్తించిన అదానీ గ్రూప్ ఆ సంస్థను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. గీతా ప్రెస్ తిరిగి తన కార్యకలాపాలను మునపటిలా అందించాలన్న దృఢమైన సంకల్పంతో అదానీ అండగా నిలిచారు. దాని పునరుద్ధరణకు తోడ్పడ్డారు.

గీతా ప్రెస్‌ను అన్ని విధాలుగా ఆదుకోవడం ద్వారా అదానీ ఆ సంస్థకు పునర్జన్మను ప్రసాదించినట్లయ్యింది. అదానీ నాయకత్వంలోని అదానీ గ్రూప్ సంస్థ గీతా ప్రెస్‌తో జతకట్టి మహాకుంభమేళ సందర్భంగా భక్తి గీతాలతో కూడిన పుస్తకాలు దాదాపుగా కోటి కాపీలను పంపిణీ చేసింది. అదానీ తీసుకున్న ఈ చొరవతో భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి,విలువలకు తిరిగి ఊతం ఇచ్చినట్లయ్యింది.

గీతా ప్రెస్ పునరుద్ధరణ,మహాకుంభ మేళలో తనవంతు సాయం చేయడంలాంటి చర్యలతో అదానీ తన గొప్ప మనసును చాటుకున్నారు.సనాతన విలువలను పరిరక్షించడంలో అదానీ గ్రూప్ తన బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తోంది. సంప్రదాయం మరియు ఆధునికత మధ్య ఉన్న ఈ సహకారం కేవలం భక్తి పండుగ మాత్రమే కాకుండా, భారతీయ సంస్కృతిలో సేవ యొక్క శాశ్వత శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది












Click it and Unblock the Notifications