వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల్లో గెలిచింది భార్య.. ఆసుపత్రి పాలైంది భర్త, కారణం అదేనా?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మీరట్ : భార్య గెలుపుని హర్షించలేని భర్తలూ ఉంటారని ఈ ఘటన రుజువు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో తన భార్య విజయం సాధించిన ఆనందంలో విషం కలిపిన మిఠాయిలు తిని ఓ భర్త ఆసుపత్రి పాలయ్యాడు.

అసలేం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణానికి చెందిన షాహిద్ అబ్బాసీ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు. తాజాగా జరిగిన మీరట్ మున్సిపల్ ఎన్నికల్లో షాహిద్ భార్య నజ్రీన్ విజయం సాధించింది.

Celebrating wife’s win, SP leader lands in ICU after eating ‘poisonous’ sweets

దీంతో అతని కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. అందరూ సంబరాల్లో ఉండగా షాహిద్‌కు రక్తపు వాంతులు ప్రారంభమయ్యాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషం కలిపిన మిఠాయి తిన్నందువల్లే అతనికి రక్తపు వాంతులు అయ్యాయని వైద్యులు తేల్చి చికిత్స చేస్తున్నారు.

స్థానిక ఎమ్మెల్యేతో పాటు పలువురు సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాహిద్ ను పరామర్శించారు. వైద్యుల నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని మీరట్ పోలీసులు చెప్పారు.

భార్య ఎన్నికల్లో గెలవడాన్ని భరించలేక షాహిద్ స్వయంగా విషం కలిపిన మిఠాయి తిని ప్రాణాలు తీసుకోవాలని భావించాడా? లేకపోతే ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనా? ప్రస్తుతానికి ఇది సస్పెన్స్‌గా మారింది.

English summary
Samajwadi Party leader Shahid Abbasi was a happy man on Saturday evening — his wife Nazreen had won election from Rashid Nagar ward and the entire family was busy in celebrations. However, Abbasi’s joy was short-lived as his condition suddenly deteriorated and he had to be rushed to the intensive care unit of a city hospital for urgent treatment.Abbasi, a former leader of Samajwadi Party (SP) corporators, was allegedly served poisonous sweets at a felicitation ceremony to mark his wife’s victory in the recently-held civic body elections. భార్య గెలుపుని హర్షించలేని భర్తలూ ఉంటారని ఈ ఘటన రుజువు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో తన భార్య విజయం సాధించిన ఆనందంలో విషం కలిపిన మిఠాయిలు తిని ఓ భర్త ఆసుపత్రి పాలయ్యాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X