వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరిగిన ముస్లీం జనసంఖ్య, 80 శాతం కంటే తగ్గిన హిందువులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2001 - 2011 మధ్య జరిగిన జన గణన వివరాల ప్రకారం భారత దేశంలో హిందువుల పెరుగుదల శాతం తగ్గగా, ముస్లీంల పెరుగుదల శాతం భారీగా పెరిగింది. ఈ పదేళ్ల కాలంలో ముస్లిం జనాభా 0.8శాతం పెరిగి 13.8కోట్ల నుంచి 17.22కోట్లకు చేరుకుంది.

హిందువుల జనాభా 0.7శాతం తగ్గింది. జనాభా 82.7 కోట్ల నుంచి 96.63కోట్లకు చేరుకుంది. జనాభా లెక్కల సేకరణ ముగిసిన నాలుగేళ్ల తర్వాత మత ప్రాతిపదికన వివరాలను మంగళవారం వెల్లడించారు. కానీ, కులాల వారీగా దేశంలో ఎంత జనాభా ఉందన్న వివరాలు మాత్రం ఇప్పటికీ బహిర్గతం కాలేదు.

కుల ప్రాతిపదికన జనాభా వివరాలను వెల్లడించాలని ఆర్జేడీ, జేడీయూ, సమాజ్‌వాది పార్టీ, డీఎంకే వంటి పార్టీలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దేశ జనాభా సామాజిక ఆర్థిక వివరాలను జూలై 3న విడుదల చేశారు.
తాజాగా వెలుగు చూసిన వివరాల ప్రకారం దేశ మొత్తం జనాభా 2011నాటికి 121.09కోట్లు.

ఇందులో హిందూ జనాభా 96.63కోట్లు (అంటే 79.8శాతం) కాగా, ముస్లిం జనాభా 17.22కోట్ల (14.2శాతం) మేర ఉంది. అలాగే క్రైస్తవ జనాభా 2.78 కోట్లు, సిక్కు జనాభా 2.08కోట్లు, బౌద్ధ మతస్థులు 0.84కోట్లు, జైనులు 0.45కోట్ల మేర ఉన్నారు. ఇతర మతస్థులు 0.45 కోట్లు, ఏ మతం కాదని చెప్పిన వారు 0.29 కోట్లు ఉన్నారు.

Census 2011: Hindus dip to below 80% of population; Muslim share up, slows down

పదేళ్ల కాలంలో హిందూ జనాభానే కాకుండా సిక్కు, బౌద్ధ మతస్థుల సంఖ్య కూడా 0.2, 0.1శాతం చొప్పున తగ్గినట్టు స్పష్టమవుతోంది. క్రైస్తవులు, జైన జనాభాలో మాత్రం చెప్పుకోదగ్గ మార్పులేవీ నమోదు కాలేదు.

2001 జనగణన వివరాల ప్రకారం అప్పట్లో భారత మొత్తం జనాభా 102 కోట్ల మేర ఉండేది. అందులో హిందూ జనాభా 82.5కోట్లుగా (80.45శాతం),ముస్లిం జనాభా 13.8కోట్లుగా (13.4శాతం) నమోదైంది. 2001-11మధ్య కాలంలో దేశ జనాభా 17.7శాతం మేర పెరిగింది.

ఇందులో హిందూ జనాభా 16.8 శాతం, ముస్లిం జనాభా 24.6 శాతం, క్రైస్తవ జనాభా 15.5 శాతం, సిక్కు జనాభా 8.4 శాతం, బౌద్ధ మతానికి చెందిన వారి జనాభా 6.1 శాతం, జైన జనాభా 5.4 శాతం మేర వృద్ధి చెందింది. కాగా, హిందువులు భారత దేశంలో తొలిసారి 80 శాతం కంటే తక్కువగా ఉన్నారు. 2001లో హిందువుల శాతం 80.45 శాతం ఉండగా, ఈసారి అది 79.8 శాతంగా ఉంది.

English summary
The Muslim community has registered a moderate 0.8 per cent growth to touch 17.22 crore in the 10 year period between 2001 and 2011, up from 13.8 crore, while Hindus population showed a decline by 0.7 per cent at 96.63 crore during the period, the census data said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X