వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం: తప్పంతా కరోనా దేవుడిదేనా? ఏడాది కాలంగా చెల్లింపులు తగ్గింది నిజం కాదా?

|
Google Oneindia TeluguNews

కరోనా దేవుడి చర్యల వల్లే ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది. జీఎస్టీ వసూళ్లపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని, అందుకే రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించలేకపోతున్నామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నెపం కరోనా దేవుడిపై వేసే ప్రయత్నం జరిగినప్పటికీ, వాస్తవంగా కరోనా కంటే ముందు నుంచే, దాదాపు ఏడాది కాలంగా చెల్లింపులు తగ్గిన మాట నిజం కాదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

చైనా మరో సంచలనం: 5జీ నెట్‌వర్క్ కోసం భారత సరిహద్దులో అక్రమ నిర్మాణాలు - సైనిక చర్యకు రావత్ సిగ్నల్చైనా మరో సంచలనం: 5జీ నెట్‌వర్క్ కోసం భారత సరిహద్దులో అక్రమ నిర్మాణాలు - సైనిక చర్యకు రావత్ సిగ్నల్

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం తర్వాత పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేంద్రం తీరుపై బాహాటంగా విమర్శలు చేశారు. సాకులు చెప్పి తప్పించుకోలేరని, జీఎస్టీ పరిహారం బాధ్యత కేంద్రానిదేనని వ్యాఖ్యానించారు. 2021 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా రూ.2.35లక్షల కోట్ల మేర లోటు ఏర్పడిందన్న నిర్మల.. దానిని పూడ్చుకోడానికి రాష్ట్రాలు ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీకి రుణం తీసుకోవడంగానీ, రూ.2.35లక్షల కోట్లను ప్రత్యేక ఏర్పాటు ద్వారా బ్యాలెన్స్ చేసుకోవచ్చంటూ ఇచ్చిన రెండు ఆప్షన్లపైగా రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. నిజానికి కరోనా కంటే ముందు నుంచే జీఎస్టీ చెల్లింపులు ప్రభావానికి గురయ్యాయి. ఎలాగంటే..

 center blames Covid-19, but GST compensation payments stalled year ago

పెద్ద నోట్ల రద్దు, కొత్తగా జీఎస్టీ చట్టం రూపొందించిన తర్వాత దాదాపు మూడేళ్లుగా దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్నది. 2019 ఆగస్టు నుంచే జీఎస్టీ ఆదాయ సేకరణపై ప్రతికూల ప్రభావం పడింది. వరుసగా, జీడీపీ వృద్ధి రేటు 2019 ఏప్రిల్-జూన్ లో 5.2 శాతం నుంచి.. జూలై-సెప్టెంబర్ నాటికి 4.4 శాతాని పడిపోగా, ఇక అక్టోబర్-డిసెంబర్ లో 4.1 శాతానికి, జనవరి-మార్చిలో ఏకంగా 3.1 శాతానికి తగ్గింది.

చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్‌కు సమీపంగా.చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్‌కు సమీపంగా.

తగ్గిన జీడీపీ వృద్ధిరేటును ప్రతిబింబిస్తూ స్థూల జీఎస్టీ ఆదాయంలోనూ క్షీణత కనిపించింది. గతేడాది ఆగస్టులో (జూలైలో అమ్మకాలకు వసూలు) జీఎస్టీ ఆదాయం రూ .98,203 కోట్లుగా తగ్గగా, సెప్టెంబర్‌లో 2.7 శాతం క్షీణతతో రూ .91,917 కోట్లరే. అక్టోబర్‌లో 5.3 శాతం తగ్గుదలతో రూ .95,380 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అయితే ఆ తర్వాత, పెద్ద పండుగల సీజన్ రావడంతో అమ్మకాలు పెరిగడం, ఎగవేతదారులపై చర్యలకు ఉపక్రమించడం, ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పై పరిమితులు విధించడంతో నవంబర్ నాటికి జీఎస్టీ వసూళ్లు మళ్లీ పెరిగాయి.

 center blames Covid-19, but GST compensation payments stalled year ago

2019 సెప్టెంబర్‌లో గోవాలో జరిగిన 37 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం మొట్టమొదటిసారి జీఎస్టీ పరిహారం చెల్లింపుల్లో సమస్యలు ఉన్నాయని అంగీకరించింది. అదే ఏడాది నవంబర్ లో జరిగిన కౌన్సిల్ భేటీలోనైతే పరిహారం చెల్లింపుల వ్యవహారం ఆందోళనకర స్థాయికి చేరిందని, లోటును పూడ్చడానికి అవకాశమేలేదని కేంద్రం కుండబద్దలు కొట్టింది. జీఎస్టీ పరిహారం చెల్లింపులు అంతకంతకూ ఆలస్యమవుతుండటంతో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తమ ఆదాయంలో తమ వాటా ఇవ్వాల్సిందేనంటూ కేంద్రాన్ని పదేపదే అడుగుతూ, ఆందోళన వ్యక్తం చేయడం ప్రారంభించారు.

Recommended Video

GST Reduced Tax Rates, Doubled Taxpayer Base To 1.24 cr - Finance Ministry || Oneindia Telugu

2019 ఆగస్టు-సెప్టెంబర్ కు సంబంధించిన జీఎస్టీ పరిహారం రూ .35,298 కోట్లను అక్టోబర్‌లో చెల్లించాల్సి ఉండగా, అక్టోబర్-నవంబర్ పరిహారాన్ని 2020 ఫిబ్రవరి, ఏప్రిల్ మాసాల్లో రెండు విడతలుగా మరో రూ .34,053 కోట్లను కేంద్రం విడుదల చేసింది. అదే ఏడాది జూన్‌ నాటి జీఎస్టీ పరిహారం రూ .36,400 కోట్లను డిసెంబర్-ఫిబ్రవరిలో విడుదల చేసింది. మార్చికి సంబంధించిన రూ .13,806 కోట్లు జూలైలో విడుదలయ్యాయి. జీఎస్టీ చట్టం (రాష్ట్రాలకు పరిహారం) ప్రకారం 2015-16 బేస్ ఇయర్ నుంచి వచ్చే ఆదాయంలో 14 శాతం మిశ్రమ వార్షిక వృద్ధి రేటుకు సమానమైన ఆదాయాన్ని రాష్ట్రాలకు అందిస్తామని కేంద్రం హామీ ఇవ్వగా, చెల్లింపుల్లో గతేడాది నుంచే క్షీణత నమోదవుతూ వస్తున్నది. వాస్తవం ఇదైతే, కేంద్రం మాత్రం నెపమంతా కరోనా దేవుడిపై వేసే ప్రయత్నం చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది.

English summary
While the Centre Thursday chose to pin much of the blame for the delays on GST compensation payments to the slowdown inflicted by the pandemic, the delays preceded the Covid-19 shock by almost a year – when payments due for August-September 2019 got delayed. Since then, all subsequent payouts have seen cascading delays.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X