వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారామిలటరీ బలగాల్లోకి ట్రాన్స్ జెండర్లు .. పరిశీలిస్తున్న కేంద్రం.. వారికి శుభ సూచకం !!

|
Google Oneindia TeluguNews

నిన్నమొన్నటిదాకా హక్కుల కోసం పోరాటం చేసిన ట్రాన్స్ జెండర్ లకు దశ తిరగబోతోందా ? బాగా ఉన్నత చదువులు చదివినా సమాజంలో వివక్షకు గురవుతూ ఏ ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్ జెండర్ లకు ఇప్పుడు పారా మిలటరీ బలగాలలో అవకాశం దక్కనుందా ? కేంద్రం ఆ దిశగా ట్రాన్స్ జెండర్ ల ను నియమించడంపై ఫోకస్ పెట్టిందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

ట్రాన్స్ జెండర్ లకు కూడా సైన్యంలో చేరి సేవ చేసే అవకాశం

ట్రాన్స్ జెండర్ లకు కూడా సైన్యంలో చేరి సేవ చేసే అవకాశం

ట్రాన్స్ జెండర్ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది అని తాజా పరిణామాలతో అర్థమవుతుంది. ట్రాన్స్ జెండర్ లను పారా మిలటరీ బలగాలలో అసిస్టెంట్ కమాండెంట్స్ గా నియమించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ట్రాన్స్ జెండర్ లను పారామిలటరీ బలగాలలోకి తీసుకునే అంశంపై సానుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ లకు కూడా సైన్యంలో చేరి సేవ చేసే అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉంది.

కేంద్ర పారా మిలటరీ బలగాలలో ఎంపికపై కసరత్తు

కేంద్ర పారా మిలటరీ బలగాలలో ఎంపికపై కసరత్తు

కేంద్ర పారా మిలటరీ బలగాలలో నాయకుల ఎంపికకై నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలకు ఇకపై ట్రాన్స్ టెండర్లను కూడా అనుమతించాలన్న ఆలోచనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతేడాది డిసెంబర్లో ట్రాన్స్ టెండర్ల హక్కుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొని వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వారికి అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని భావిస్తున్న కేంద్ర సర్కార్ ట్రాన్స్ జెండర్ ల విషయంలో త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో స్త్రీ, పురుషులతో సమానంగా ట్రాన్స్ జెండర్స్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో స్త్రీ, పురుషులతో సమానంగా ట్రాన్స్ జెండర్స్

గతేడాది డిసెంబర్‌లో కేంద్రం ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ చట్టాన్ని రూపొందించింది. ఇక ఈ చట్టం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నియమించే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల్లో మేల్, ఫిమేల్ ఆప్షన్ తో పాటు ట్రాన్స్‌జండర్‌ అనే ఆప్షన్‌‌ను పొందుపరచనుంది. స్త్రీ, పురుషులతో సమానంగా వారి జెండర్ ను కూడా చేర్చటం ట్రాన్స్ జెండర్ లలో కొంత ఆత్మ విశ్వాసాన్ని కలిగించింది.

ట్రాన్స్ జెండర్ ల ఎంపికకు సంబంధించి సిఏపీఎఫ్ అభిప్రాయం

ట్రాన్స్ జెండర్ ల ఎంపికకు సంబంధించి సిఏపీఎఫ్ అభిప్రాయం

ఈ వ్యవహారంలో పారా మిలటరీ బలగాలలో వారి ఎంపికకు సంబంధించి వైఖరి ఏంటో చెప్పాలని సిఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఐటీబీపీ, బిఎస్ఎఫ్, సి ఆర్ పి ఎఫ్, ఎస్ ఎస్ బీ విభాగాల్లో ట్రాన్స్ టెండర్లను నియమించడంపై చాలా కాలం నుండి ఫోకస్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం వారి నియామకానికి సంబంధించి విధి విధానాలు, ప్రణాళికలు ఎలా ఉండాలో చెప్పాలని సిఏపిఎఫ్ బలగాలను కోరింది. అయితే ట్రాన్స్ జెండర్ ల ను పారా మిలటరీ బలగాల లోకి తీసుకునే అంశంపై ఆర్మీ అధికారులు సానుకూల వైఖరి వ్యక్తమౌతుంది.

ట్రాన్స్ జెండర్ లపై ప్రభుత్వ నిర్ణయాలతో సమాజంలో మారుతున్న వైఖరి

ట్రాన్స్ జెండర్ లపై ప్రభుత్వ నిర్ణయాలతో సమాజంలో మారుతున్న వైఖరి

కొందరు శరీరం ఫిట్ గా ఉంటే లింగ భేదం అసలు సమస్య కాదని పేర్కొంటే, మరికొందరు ట్రాన్స్ జెండర్ ల సత్తా చూపించడానికి, దేశం కోసం వారి సేవలు వినియోగించుకోవాలని ఆలోచించడం మంచి నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. ట్రాన్స్ జెండర్ లపై అపోహలు పడుతున్న వారికి , వారి అపోహలు తొలగించడానికి ఇది మంచి అవకాశం గా ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పారామిలటరీ దళాలలో ట్రాన్స్ జెండర్ ల నియామకంపై కేంద్రం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో సత్తా ఉన్న ట్రాన్స్ జెండర్ లు దేశానికి సేవ చేయడానికి సిద్ధమై పోవాల్సిందే. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ట్రాన్స్ టెండర్లకు నిజంగా ఇది సువర్ణ అవకాశం అవుతుంది. వారిపై సమాజంలో కొనసాగుతున్న వివక్షకు చెక్ పడుతుంది.

English summary
Central goernment focusing on Transgenders to take into the paramilatary forces as assistant commandants. the Ministry of Home Affairs has asked the Central Armed Police Forces (CAPF) for their views on recruiting transgender into the forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X