వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ... ఆ పంటలపై మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ బిల్లుతో చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి లాభం జరగదని విమర్శలు గుప్పిస్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈ బిల్లు ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా కేంద్రం ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పేలా ఒక నిర్ణయం తీసుకుంది.

 ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

రైతులకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ బిల్లు తెచ్చామని కేంద్రం చెప్తుంటే, ఈ బిల్లు ద్వారా రైతులను నిలువునా ముంచుతున్నారు అని ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. లోక్సభతో పాటు రాజ్యసభలో అనేక పరిణామాల మధ్య కొత్త వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి.

తాజాగా ఈ బిల్లు ద్వారా రైతులకు నష్టం జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది . రైతులు పండించే వివిధ పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పి ని పెంచుతూ కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకుంది.

6 రకాల పంటలపై కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

6 రకాల పంటలపై కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

2021 - 22 రబీ సీజన్ కు ఈ కొత్త మద్దతు ధరలు అమలు కానున్నాయని తెలుస్తుంది. 6 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది కేంద్రం. గోధుమలపై కనీస మద్దతు ధర 50 రూపాయలు పెంచింది. అదేవిధంగా శనగపప్పు పై 225 రూపాయలు, ఎర్ర పప్పు పై మూడు వందల రూపాయలు, ఆవాల పై 225 రూపాయలు, కుసుమ పై 112 రూపాయలు, బార్లీ పై 75 రూపాయలు పెంచింది కేంద్రం. వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభలో మాట్లాడుతూ గోధుమల రేటులో 2.6% పెరుగుదలతో సహా ఆరు పంటలకు ఎంఎస్‌పి పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు .

 ఎన్డీయే హయాంలో కాంగ్రెస్ పాలన నాటి కంటే మెరుగ్గానే ఎంఎస్పీ ధరలు .. చెప్పిన మంత్రి

ఎన్డీయే హయాంలో కాంగ్రెస్ పాలన నాటి కంటే మెరుగ్గానే ఎంఎస్పీ ధరలు .. చెప్పిన మంత్రి

గత సంవత్సరం, గోధుమలకు కనీస మద్దతు ధర 4.6% పెరిగింది. వాస్తవానికి, కొద్ది శాతం మంది రైతులు మాత్రమే ఎంఎస్‌పి రేట్లకు ప్రభుత్వానికి విక్రయించగలుగుతారు, అయినప్పటికీ బిజెపి ప్రభుత్వంలో ఆహార ఉత్పత్తుల సేకరణ పరిమాణంతో పాటుగా , ధరలు కూడా గణనీయంగా పెరిగాయని తోమర్ పేర్కొన్నారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాల ప్రకారం, కాంగ్రెస్ హయాంలో కంటే బీజేపీ హయాంలోనే ఎంఎస్పీ బాగా పెరిగిందని చెప్పుకొచ్చారు . 2019-20లో 36% ఎక్కువ గోధుమల కొనుగోలు జరిగిందని 2013-14తో పోల్చితే, 85% విలువ ఎక్కువని ఆయన పేర్కొన్నారు . వరి సేకరణకు సంబంధించి, 2019-20లో 114% కొనుగోళ్ళ పెరుగుదల ఉందని , 2013-14తో పోల్చితే,192% విలువ ఎక్కువని ఆయన అన్నారు .

Recommended Video

Intra-Afghan Talks : ఇంట్రా-ఆఫ్ఘన్ చర్చల ప్రారంభానికి హాజరైన భారత విదేశాంగ మంత్రి S Jaishankar
యూపీఏ , ఎన్డీఏ పాలనలో కనీస మద్దతు ధరలను పోల్చుతూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్

యూపీఏ , ఎన్డీఏ పాలనలో కనీస మద్దతు ధరలను పోల్చుతూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్


మరోవైపు యూపీఏ హయాంలో ధరలతో , ప్రస్తుత ఎన్డీఏ పాలనలో కనీస మద్దతు ధరలను పోల్చుతూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో స్పందించిన మంత్రి యూపీఏ హయాంలో ఎర్ర పప్పు 2950 రూపాయలు ఉంటే ప్రస్తుతం 5,100 రూపాయలు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. మినప్పప్పు ధర 4,300 రూపాయల నుండి 6 వేలకు పెరిగిందని, కందిపప్పు 4,300 రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు, పెసర పప్పు ధర 4వేల 500 రూపాయల నుండి 7196 రూపాయలకు పెరిగాయని పేర్కొన్నారు. శనగలు 3,100 రూపాయల నుండి 5 ,100 రూపాయలకు, ఆవాలు యూపీఏ హయాంలో 3,050 రూపాయలుండగా ఎన్డీఏ హయాంలో 4650 రూపాయలకు పెరిగాయని ప్రకాష్ జవదేకర్ ట్వీట్ చేశారు.

English summary
Opposition parties have protested against the Centre's decision to introduce a new farm bill . The new agriculture bills were passed amid several developments in the Lok Sabha as well as the Rajya Sabha.The Center has recently taken a crucial decision to check the criticisms made by the opposition parties that the bill would cause loss to the farmers. The Union Cabinet has decided to increase the minimum support price MSP for various crops grown by farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X