వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసులు పెరుగుతుంటే ఫిడేలు వాయిస్తున్నారా..? నివారణ చర్యలపై రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : దేశంతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. జోన్లుగా విభజించిన తర్వాత కరోనా వైరస్ గణనీయంగా తగ్గిపోయిందని, రెడ్ జోన్లను కూడా గ్రీన్ జోన్లలో కలిపే ప్రయత్నాలు చేసారు అధికారులు. అంతే కాకుండా లాక్‌డౌన్ ఆంక్షల నుండి చాలా వరకు మినహాయింపులు కూడా ఇచ్చారు. తాజాగా అన్ని రాష్ట్రాల్లో సాధారణ జనజీవనం నెలకొంది. పెరుగుతున్న కేసులను పట్టించుకోకుండా ఎవరి కార్యకలాపాలలో వారున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా లాక్‌డౌన్ ఆంక్షలను వదిలేసి రాత్రిపూట కర్ఫ్యూ మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఇదే అంశం పట్ల కేంద్రం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

కరోనా రోగులకు వైద్యం చేసే నర్సుల డ్రెస్ మారింది..!ఇక మీదట బికినీలోనే ట్రీట్ మెంట్..!కరోనా రోగులకు వైద్యం చేసే నర్సుల డ్రెస్ మారింది..!ఇక మీదట బికినీలోనే ట్రీట్ మెంట్..!

వేగంగా వ్యప్తి చెందుతున్న కరోనా.. చోద్యం చూస్తున్నారా అంటూ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు..

వేగంగా వ్యప్తి చెందుతున్న కరోనా.. చోద్యం చూస్తున్నారా అంటూ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు..

అంతే కాకుండా పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఊహించిన దానికంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కేసులు ప్రబలుతుండడం వెనుక రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వుందని కేంద్రం నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా రాష్ట్ర ప్రభుత్వాలకు గురువారం లేఖ రాశారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లకు లేఖ రాసిన అజయ్ భల్లా, కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చిరికలు జారీ చేసారు.

కరోనా కేసులు పెరుగుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వద్దన్న హోంశాఖ..

కరోనా కేసులు పెరుగుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వద్దన్న హోంశాఖ..

ఇదిలా ఉండగా హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కొన్ని రాష్ట్రాలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఉల్లంఘిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని మార్గదర్శకాలు ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలని, మార్గదర్శకాలను అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు స్థానిక అధికారులు తీసుకోవాలని అజయ్ భల్లా గురువారం పంపిన లేఖల్లో పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ హెచ్చరికలను జారీ చేసినట్టు తెలుస్తోంది.

కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ సీరియస్.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు లేఖ..

కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ సీరియస్.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు లేఖ..

మరోవైపు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కేంద్రం విధించిన రాత్రి పూట కర్ఫ్యూని అమలు పరచబోమని ప్రకటించాయి. ఇది మంచి పరిణామం కాదని కేద్రం వాదిస్తోంది. మరికొన్ని రాష్ట్రాలు అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సామాజిక దూరం వంటి నిబంధనలను పాటించడం లేదు. మరోవైపు అంతర్రాష్ట్ర రోడ్డు రవాణా అంశాన్ని కేంద్ర రాష్ట్రాలకు అప్పగించింది. రైలు ప్రయాణాలను ప్రారంభించిన రైల్వే శాఖ, జూన్ ఒకటి నుంచి సాధారణ రైళ్ళను కూడా నడిపేందుకు టికెట్లను జారీ చేస్తోంది. ఇది మరింత ఆందోళనకరంగా మారినట్టు కేంద్రం అంచనా వేస్తోంది.

Recommended Video

Trump To Bring Back Drug Making To US From India And China
రైళ్లు, విమానాలు ప్రారంభం కాలేదు.. మరింత జాగ్రత్తగా ఉండాలంటున్న కేంద్రం..

రైళ్లు, విమానాలు ప్రారంభం కాలేదు.. మరింత జాగ్రత్తగా ఉండాలంటున్న కేంద్రం..

ఇక ఇదే నెల మే 25వ తేదీ నుంచి దేశంలో డొమెస్టిక్ విమానాలను కూడా నడపబోతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక దూరం, శానిటైజర్లు, ఫేస్ మాస్కుల వినియోగంతోపాటు పెద్ద సమూహాలుగా కూడే సభలు, సమావేశాలను నిర్వహించకుండా చూసుకోవడం రాష్ట్రాల తక్షణ కర్తవ్యంగా మారింది. ఈ సూచనలను పాటించని రాష్ట్రాలు తీరు మార్చుకోవాలని హోం శాఖ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నారు. రైళ్లు, విమానాలు ప్రారంభం కాకముందే పరిస్థితి ఈ విధంగా ఉందంటే అవన్నీ ప్రారంభమైతే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

English summary
States and Union Territories where coronavirus is most prone to strict adherence to all guidelines,Ajay Bhalla, in a letter sent Thursday, said local authorities should take all necessary steps to implement the guidelines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X