వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖరీఫ్‌కు మద్దతు ధర పెంచేందుకు కేంద్రం ఓకే.. ఎంత పెరిగిందో తెలుసా ..!! ముగిసిన క్యాబినెట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : వానాకాలం పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతోపాటు మూడు ఎయిర్‌పోర్టులను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత తీసుకున్న కీ డిషిషన్స్ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు. దీంతోపాటు మూడు కీలక బిల్లులకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని తెలిపారు.

మద్దతు ధర ..
ఖరీఫ్ పంటకు మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019-20 పంట సీజన్‌కు సంబంధించి మద్దతు ధర 3.7 శాతం పెంచనున్నట్టు పేర్కొన్నది. దీంతో క్వింటాల్ వరి ధర రూ.1815కి చేరింది. దీంతోపాటు జొన్నలు, రాగులు, పప్పు ధాన్యాల ధరలను కూడా పెంచుతామని సూత్రప్రాయంగా తెలిపింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

center will be mnp in paddy

లీజుకు ఎయిర్‌పోర్టులు ..
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింది అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు జవదేకర్ తెలిపారు. దీంతోపాటు కొత్తగా తీసుకొచ్చిన కీలక ప్రతిపాదనలకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. మూడు కీలక బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించినట్టు జవదేకర్ పేర్కొన్నారు. అయితే వాటి వివరాలను తర్వాత చెబుతామని తెలిపారు. బడ్జెట్ సెషన్‌లో ఆ బిల్లుల వివరాల గురించి తెలియజేస్తామని పేర్కొన్నారు. వేజ్ కోడ్‌పై బిల్లుకు కూడా మంత్రివర్గ ఆమోదముద్ర వేసినట్టు తెలిపారాయన.

English summary
The central government has agreed to support the monsoon crop. It has also decided to lease three airports. Union Minister Prakash Javadekar explained to the media the key decisions taken after the Union Cabinet meeting. The cabinet has also approved three key bills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X