వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మశ్రీ అవార్డులు 2020 : 21 మందికి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

|
Google Oneindia TeluguNews

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన 21 మందికి అవార్డులను ప్రకటించింది. వీరిలో పంజాబ్‌కి చెందిన సామాజిక కార్యకర్త జగదీష్ లాల్ అహుజా,జమ్మూకశ్మీర్‌కి చెందిన జావేద్ అహ్మద్(సామాజిక సేవ-వికలాంగుల సంక్షేమం),కర్ణాటకకు చెందిన తులసిగౌడ(పర్యావరణం), అరుణాచల్‌ప్రదేశ్‌కి చెందిన సత్యనారాయణ్( సామాజిక సేవ-తక్కువ ఫీజుతో విద్యా బోధన),మధ్యప్రదేశ్‌కి చెందిన అబ్దుల్ జబ్బార్(భోపాల్ గ్యాస్ బాధితుల పోరాట కార్యకర్త),ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఉషా చమర్(శానిటేషన్),మహారాష్ట్రకు చెందిన పోపట్ రావ్ పవార్(నీటి పారుదల),కర్ణాటకకు చెందిన హరేకాల హజబ్బా(వ్యవసాయం)లకు అవార్డులు దక్కాయి.

central announced padma shri awards for 21 people

కాగా,జగదీష్ అహుజా ఛండీఘడ్‌లోని పీజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ వద్ద పేద పేషెంట్లకు ప్రతీరోజూ ఉచిత అన్నదానం చేస్తుంటాడు. అలాగే పేషెంట్ల మందులు, దుస్తులు, బట్టలు, దుప్పట్ల కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తాడు. 1980 నుంచి ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. 15 ఏళ్లుగా ప్రతీ రోజూ దాదాపు 2వేల మందికి అతను ఉచితంగా అన్నదానం చేస్తున్నాడు. పేద ప్రజల కోసం అతను చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

జగదీష్ దేశ విభజన సందర్భంగా వట్టి చేతులతో దేశంలోకి వచ్చి స్థిరపడ్డాడు. స్వయం శక్తితో బిలియనీర్‌గా ఎదిగాడు. తను చేపడుతున్న సామాజిక కార్యక్రమం కోసం కోట్ల విలువ చేసే తన ఆస్తులను కూడా అమ్మేశాడు.

జావెద్ అహ్మద్ తక్ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో వికాలంగ చిన్నారులకు చేయూతను అందిస్తున్నాడు. ఉగ్రవాదుల దాడిలో బుల్లెట్ తగలడంతో తలెత్తిన వెన్నెముక సమస్య కారణంగా 1997 నుంచి వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.

ఇక మరో పద్మశ్రీ అవార్డు గ్రహీత మహ్మద్ షరీఫ్ గత 25 ఏళ్లుగా గుర్తు తెలియని మృతదేహాలకు అంత్యక్రియలు జరిపిస్తూ మానవత్వం చాటుతున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 25వేల మృతదేహాలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ 'ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్'గా గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న జాతుల మొక్కలు మరియు మూలికల గురించి ఆమెకు ఉన్న అపారమైన జ్ఞానంతో ఆ గుర్తింపు తెచ్చుకున్నారు. వెనుకబడిన సామాజికవర్గంలో పేదరికంలో పెరిగినప్పటికీ, గత 60 సంవత్సరాలుగా ఆమె వేలాది చెట్లను నాటి వాటిని సంరక్షించారు. 72 ఏళ్ల వయసులో ఇప్పటికీ మొక్కల పెంపకం,పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.

English summary
Central Government announced Padmashri awards for 21 people on the eve of Republic day. Awardees are including Jagdish Jal Ahuja, Mohammed Sharif, Tulasi Gowda and Munna Master
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X