• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది..? బిల్లుతో ఎవరికి లాభం ఎవరికి నష్టం?

|

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈశాన్య భారతంకు చెందిన రాష్ట్రాలు సిటిజెన్‌షిప్ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బిల్లుపై ప్రాధాన్యత సంతరించుకుంది.. అసలు పౌరసత్వ సవరణ బిల్లు మూలాలేంటి..? కేంద్రం ఈ బిల్లుకు సవరణ తీసుకురావడం ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం..?

పౌరసత్వ సవరణ బిల్లు: రాజ్యసభలో గట్టెక్కుతుందా..? శివసేన ఎటువైపు

వివాదాస్పద సిటిజెన్‌షిప్ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వివాదాస్పద సిటిజెన్‌షిప్ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. 1955 పౌరసత్వ బిల్లుకు సవరణలు చేస్తూ బిల్లును కేంద్రం రూపొందించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆఫ్ఘానిస్తాన్‌ నుంచి వచ్చి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా భారత్‌లో స్థిరపడిన హిందువులకు, సిక్కులకు, బౌద్ధులకు, జైనులకు, పార్శీలకు, క్రైస్తవులకు భారతదేశ పౌరసత్వం కల్పించేలా సవరణలు చేసింది.

 ముస్లింలకు నష్టం చేకూరుస్తుందా..?

ముస్లింలకు నష్టం చేకూరుస్తుందా..?

పాకిస్తాన్‌లో వివక్షకు గురై ముస్లిం సామాజిక వర్గానికి చెందిన షియాలు, అహ్మదీయులకు ఈ ప్రతిపాదించిన బిల్లులో చోటు ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు వలసదారులు 11 ఏళ్లుగా భారత్‌లో నివసిస్తున్నట్లయితే వారికి భారత పౌరసత్వం ఇవ్వాలని ఉండగా...దాన్ని ఆరేళ్లకే తగ్గిస్తూ కేంద్ర తాజాగా సవరణలు చేసింది.

NRCకి పౌరసత్వ బిల్లుకు ఏంటి సంబంధం..?

NRCకి పౌరసత్వ బిల్లుకు ఏంటి సంబంధం..?

పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన హిందువులకు పౌరసత్వ బిల్లు రక్షణ కల్పిస్తుండగా... ఎన్‌ఆర్‌సీ మాత్రం మత ప్రాతిపదికన కాకుండా భారత్‌కు మార్చి 24, 1971 తర్వాత వచ్చి స్థిరపడ్డ అక్రమవలసదారులను తిరిగి తమ దేశాలకు పంపించేలా రూపొందించారు. ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించి తిరిగి తమ దేశాలకు పంపే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. ఇక బిల్లు అమల్లోకి వస్తే ముస్లింయేతర ప్రజలకు ఎలాంటి హానీ ఉండదు. అయితే ముస్లింలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబికే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.

 పలు విద్యార్థి సంఘాలతో అమిత్ షా చర్చలు

పలు విద్యార్థి సంఘాలతో అమిత్ షా చర్చలు

కేంద్రం తీసుకువచ్చిన బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లోని మేధావులు విద్యార్థి సంఘాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి.బిల్లులో పొందుపర్చిన అంశాలను చూస్తే ఈశాన్య రాష్ట్రంలో ఉంటున్న అసలైన భారతీయులపై ప్రభావం చూపుతుందని వారు చెప్పారు. అంతేకాదు 1985 అస్సాం ఒప్పందాన్ని ప్రతిపాదిత పౌరసత్వ సవరణ బిల్లు హాని కలిగించేలా ఉందని పెద్ద సంఖ్యలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజా సంఘాలు అభ్యంతరం తెలిపాయి.

బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేసిన ఈశాన్య రాష్ట్రాలు

బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేసిన ఈశాన్య రాష్ట్రాలు

ఇక కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐఎంతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా బిల్లను వ్యతిరేకించాయి. మత ప్రాదిపతికన పౌరసత్వం ఇవ్వరాదని చెబుతున్నాయి. ఈ బిల్లు వల్ల పెద్ద సంఖ్యలో గిరిజనులకు హాని జరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తొలిసారిగా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి పాస్ చేయించింది. అయితే ఈశాన్య రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యతిరేకత వ్యక్తం అవడంతో రాజ్యసభలో ప్రవేశపెట్టలేదు. లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు కూడా రద్దు అయ్యింది.

బిల్లు అమలైతే ఎంతమంది లబ్ధి పొందుతారు..?

బిల్లు అమలైతే ఎంతమంది లబ్ధి పొందుతారు..?

ఇక పాత బిల్లు ప్రకారం 2014 డిసెంబర్ 31వరకు ఎవరైతే భారత్‌లో వచ్చి స్థిరపడ్డారో బిల్లు అమల్లోకి వస్తే లాభపడతారు. ఇక ఈ బిల్లు ద్వారా అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన వారు దాదాపు 31వేల మంది లబ్ధిపొందుతారు. మత ప్రాతిపదికన పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారు లబ్ధి పొందుతారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇంటెలిజెన్స్ బ్యూరో వలసదారులకు సంబంధించి సమాచారం ఇచ్చింది. దాదాపు 31,313 వలసదారులు ఈ బిల్లు అమలుతో లబ్ది పొందుతారని ఇంటెలిజెన్స్ బ్యూరో గతంలో చెప్పింది.

English summary
CITIZENSHIP (AMENDMENT) BILL amends the Citizenship Act, 1955 to make people from Hindu, Sikh, Jain Buddhist, Christian and Parsi faiths who entered India from Afghanistan, Bangladesh and Pakistan eligible for citizenship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X