వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బ్రూ' లకు ఓటింగ్ ఛాన్స్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఐజ్వాల్‌ ‌: మిజోరం ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు మమిత్ జిల్లా కాన్హమున్ గ్రామంలో బ్రూ లు ఓట్లు వేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంతో స్టేట్ ఎలక్షన్ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేసేందుకు సిద్దమయ్యారు. మిజోరం, త్రిపుర సరిహద్దుల్లోని కాన్హమున్ గ్రామంలో ఈవీఎంలు పెట్టి శరణార్థి శిబిరాల్లో ఉంటున్న బ్రూ లు ఓటు వేసేవిధంగా అన్నీ సిద్ధం చేస్తున్నారు.

త్రిపురలోని శరణార్థి శిబిరాల్లో ఉంటున్న బ్రూ ఓటర్లు మిజోరంలో తమ ఓటు హక్కు వినియోగించుకునే అంశంపై దుమారం రేగింది. 11,232 మంది బ్రూ ల ఓట్లు వివాదస్పదంగా మారాయి. ఎంతలా అంటే మిజోరం ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ పదవికే ఎసరు వచ్చింది.

శరణార్థులుగా బ్రూ లు.. అందుబాటులో పోలింగ్ కేంద్రం

శరణార్థులుగా బ్రూ లు.. అందుబాటులో పోలింగ్ కేంద్రం

మూడేళ్ల నుంచి మిజోరంలో ఓటర్ల విషయంలో పునర్ సమీక్ష జరగలేదని ఎన్నికల అధికారి తెలిపారు. ఇటీవలే ఆ విషయంపై దృష్టిసారించామని చెప్పారు. 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్రూ శరణార్థులకు ఓటు హక్కు ఉన్నట్లు తేలిందని చెప్పారు. శరణార్థులుగా ఎక్కడైతే ఉంటున్నారో.. వారికి అందుబాటులో ఉన్న గ్రామంలో ఈవీఎం యంత్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పోలింగ్ సజావుగా సాగేలా త్రిపుర సర్కార్ సాయం తీసుకుంటామన్నారు.

మొత్తం 3,584.. 490 ఔట్.. ఇంకా మిగిలేది ఎంతమందో? మొత్తం 3,584.. 490 ఔట్.. ఇంకా మిగిలేది ఎంతమందో?

 ఎట్టకేలకు నిర్ణయం.. బ్రూ లకు ఓటింగ్ ఛాన్స్

ఎట్టకేలకు నిర్ణయం.. బ్రూ లకు ఓటింగ్ ఛాన్స్

మమిత్ జిల్లా పరిధిలోకి వచ్చే హచ్చెక్, దంపా, మమిత్ నియోజకవర్గాలున్నాయి. ఈ స్థానాల్లో అత్యధికంగా బ్రూ ఓటర్లు నమోదయి ఉన్నారు. అయితే వీరంతా మిజోరం, త్రిపుర సరిహద్దుల్లోని 6 శరణార్థి శిబిరాల్లో ఉన్నారు. దీంతో వీరందరు ఓటు వేసేందుకు వీలుగా రెండు రాష్ట్రాల సరిహద్దులోని కాన్హమున్ గ్రామాన్ని ఎంపిక చేశారు ఎన్నికల అధికారులు.

ఈనెల 28న పోలింగ్.. డిసెంబర్ 11న ఫలితాలు

ఈనెల 28న పోలింగ్.. డిసెంబర్ 11న ఫలితాలు

మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 28న పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల 68 వేల 181 మంది ఓటర్లు ఉన్నారు. కోలసిబ్, టుయోరియాల్ నియోజకవర్గంలో బ్రూ లు 3.5 శాతం మంది ఉన్నట్లు సమాచారం. వీళ్లు అత్యధికంగా మమిత్ జిల్లాలో అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లా పరిధిలో హచ్చక్, దంప, మమిత్ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 14 శాతం మంది బ్రూ లు ఓటు హక్కు కలిగివున్నారు.

English summary
EC says Bru refugees to vote in Mamit district, tribals fear for safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X