వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ కంపెనీల అద్దెలు రద్దు .. సాఫ్ట్ వేర్, స్టార్టప్ కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్ ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ నేపథ్యంలో కొనసాగుతున్న లాక్ డౌన్ తో ఆర్ధిక రంగం కుదేలైంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు బాగా దెబ్బ తిన్నాయి. చాలా కంపెనీలు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఉద్యోగులను తొలగిస్తున్న పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అయితే విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా సాఫ్ట్‌వేర్‌, స్టార్టప్‌ కంపెనీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కాసింత ఊరటనిచ్చింది.

కరోనా నేర్పిన జీవితం: సింపుల్ గా బతకటానికి అలవాటు పడుతున్న జనాలుకరోనా నేర్పిన జీవితం: సింపుల్ గా బతకటానికి అలవాటు పడుతున్న జనాలు

సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌లలో ఉంటున్న కంపెనీల అద్దెలను రద్దు చేసింది కేంద్ర సర్కార్ . మార్చి నుంచి జూన్‌ వరకు నాలుగు నెలల పాటు అద్దె చెల్లించనవసరం లేదని కేంద్ర సమాచార శాఖ సదరు కంపెనీలకు ప్రకటించింది. ఎస్‌టీపీఐకి దేశవ్యాప్తంగా 60 ప్రాంతాల్లో భవనాలు ఉండగా వాటిలో 200 ఐటీ, ఐటీఈఎస్, ఎంఎస్‌ఎఈ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో నష్టాలను చవి చూస్తున్న వారికి ఊరట నిచ్చేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు

central government says Good news for software and startup companies

భారతదేశంలోని 60 ఎస్‌టిపిఐ కేంద్రాల నుండి పనిచేస్తున్న ఐటి యూనిట్లు / స్టార్టప్‌లకు మార్చి 1 , 2020 జూన్ 30 2020 మధ్య కాలానికి అద్దె చెల్లించకుండా మాఫీ ఇవ్వబడిందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల దాదాపు 200 మంది ఐటీ, స్టార్టప్ కంపెనీలకు ప్రయోజనం ఉంటుంది. ఇక ఈ చిన్న మరియు మధ్యతరగతి యూనిట్లు 3000 ప్రత్యక్ష ఉద్యోగాలకు మద్దతు ఇస్తున్నాయని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ 4 నెలల కాలంలో ఈ యూనిట్లకు అందించిన అద్దె మినహాయింపు మొత్తం ఖర్చు సుమారు 5 కోట్ల రూపాయలుగా ఉందని తెలుస్తుంది.

English summary
Central government cancels rentals of companies in software technology parks .The Central Information Department has informed the companies that it will not pay rent for four months from March to June. STPI has 60 locations across the country, of which 200 are IT, ITES and MSAE. Union Minister of Electronics and IT Ravi Shankar Prasad tweeted to let them know
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X