వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైనల్లీ వాళ్ళు అనుకున్నది సాధించారు ... ట్రాన్స్ జెండర్ లకు కేంద్రం గుడ్ న్యూస్

|
Google Oneindia TeluguNews

సమాజంలో హిజ్రాలుగా పిలవబడే ట్రాన్స్ జెండర్ లను చిన్నచూపు చూస్తున్నారని, స్త్రీ , పురుషులతో సమానంగా చూడటం లేదని చాలా సందర్భాల్లో హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి హిజ్రాల పట్ల లింగ వివక్ష లేదని , సామర్ధ్యం ఉంటే వాళ్ళు ఏ వృత్తిలో అయినా రాణిస్తారని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఇక లాంటి ట్రాన్స్ జెండర్ ల కోసం కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది .

పురుషులు, మహిళలతో పాటు తమకు సమాన అవకాశాలు కల్పించాలని ట్రాన్స్ జెండర్ లు కొన్ని సంవత్సరాలుగా పోరాటమే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది డిసెంబర్‌లో కేంద్రం ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ చట్టాన్ని రూపొందించింది. ఇక ఈ చట్టం ఆధారంగా ఇకపై కేంద్ర ప్రభుత్వం నియమించే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల్లో మేల్, ఫిమేల్ ఆప్షన్ తో పాటు ట్రాన్స్‌జండర్‌ అనే ఆప్షన్‌‌ను పొందుపరచనుంది.ఇక స్త్రీ, పురుషులతో సమానంగా వారి జెండర్ ను కూడా చేర్చటం ట్రాన్స్ జెండర్ లకు నిజంగా గుడ్ న్యూస్ .

central government says good news to transgenders

ఇప్పటి వరకు బాగా చదువుకున్న ట్రాన్స్ జెండర్ లు ఏదైనా ఉద్యోగ దరఖాస్తుకు స్త్రీగా ఆప్షన్ పెట్టాలా , పురుషుడుగా ఆప్షన్ పెట్టాలా తెలియక తెగ ఇబ్బంది పడేవాళ్ళు . ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి స్త్రీపురుషులతో సమానంగా చోటు ఇవ్వటమే కాకుండా ఒక గౌరవాన్ని కూడా ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఇచ్చినట్లు అవుతుంది. ఇదే విషయంలో ఈ మేరకు మార్పులు చేయాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సూచించింది. అంతే కాకుండా లింగమార్పిడి చేసుకున్నవారికి సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నియమావళిని కూడా మార్చాలని ఆదేశాలు జారీచేసింది. ఇది నిజంగా సామాజిక వివక్షకు గురవుతున్న ట్రాన్స్ జెండర్ లకు శుభ వార్తే .

English summary
Transgender people have been fighting for years to give men and women equal opportunities. asking central government. Against this backdrop the central government has told them good news. In December last year, the Center drafted the Transgender Persons Protection of Rights Act. Transgender option will be included in all government employment applications .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X