• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Today In Parliament : సీడీఎస్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదం పై ప్రకటన - నివాళి : విపక్షాల సమావేశం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా..ఈ రోజున కేంద్రం కీలక ప్రకటన చేయనుంది. దేశ రక్షణ దళాల సారధి (సీడీఎస్) తో సహా పలువురి సైనిక సిబ్బంది మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదం పైన కేంద్రం ప్రకటన చేయనుంది. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ అత్యవసర ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేరుగా రావత్ నివాసానికి వెళ్లారు. సాయంత్రం జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ ప్రమాదం పైన చర్చించారు.

ఘటన పైన పూర్తి వివరాలతో ప్రకటన

ఘటన పైన పూర్తి వివరాలతో ప్రకటన

ఇక, ఈ మొత్తం వ్యవహారం.. ప్రమాదానికి కారణాలు... కేంద్ర ప్రభుత్వ పరంగా మరణించిన వారికి అండగా నిలిచే అంశాల పైన కేంద్రం ప్రకటన చేయనుంది. ఈ ఘోర దుర్ఘటనలో రావత్‌ దంపతులతోపాటు మొత్తం 13 మంది మరణించారు. ఒకే ఒక్కరు.... గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ మాత్రం తీవ్రమైన కాలిన గాయాలతో సజీవంగా బయటపడ్డారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉందని తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఊటీ సమీపంలోని కున్నూరు వద్ద ఈ ఘోరం జరిగింది. ఉభయ సభల్లోనూ రావత్ మరణానికి సంతాపం ప్రకటించటంతో పాటుగా నివాళి అర్పించనున్నారు.

బిపిన్ తో సహా ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి

బిపిన్ తో సహా ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి

ఇక, సాధారణ బిజినెస్ లో భాగంగా ప్రశ్నోత్తరాల తరువాత పలువురు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన పేపర్లను సభ ముందు ఉంచనున్నారు. అనేక అంశాల పైన ఏర్పాటైన స్టాండింగ్ కమిటీలు సైతం తన నివేదికలను సభకు సమర్పించనున్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిటీషన్ యాక్ట్ 2021 సవరణ బిల్లును ప్రతిపాదించటంతో పాటుగా సభ ఆమోదం కోసం ప్రవేశ పెట్టనున్నారు. అదే విధంగా ది ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు, 1946 లో సవరణ ప్రతిపాదనలతో కూడిన బిల్లుకు సైతం సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

  Nagaland : దారుణ ఘటన India Forces పై కేసు | Amit Shah || Oneindia Telugu
  బిపిన్ రావత్ సేవల పైన సభలో ప్రస్తావన

  బిపిన్ రావత్ సేవల పైన సభలో ప్రస్తావన

  ఇక, రాజ్యసభలో 12 మంది సభ్యుల సస్పెన్షన్ పైన వివాదం కొనసాగుతూనే ఉంది. సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. క్షమాపణ చెబితే పరిశీలిస్తామని ఛైర్మన్ స్పష్టం చేసారు. తాము క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని..తాము ఏం తప్పు చేయలేదని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మరో సారి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నాయతక్వంలో మరోసారి ప్రతిపక్ష నేతలు సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే, బిపిన్ రావత్ ప్రమాదంలో మరణించటంతో... ఈ సమావేశం వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజ్యసభలోనూ బిపిన్ రావత్ మరణం పైన సంతాపం వ్యక్తం చేయటంతో పాటుగా ఆయన దేశానికి చేసిన సేవలను సభలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది.

  English summary
  Central govt make statement in Parliament on the incident in which security personnel including CDS Bipin Rawat were died in a helicopter crash
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X