వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు విఫలం: డిసెంబర్ 3న మరోసారి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళన నేపథ్యంలో చట్టాలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించలేదు.

అంతగాక, కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విజ్ఞాన్ భవన్‌లో వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న 35 రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తోపాటు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ చర్చలు జరిపారు.

central Govt’s meeting with farmer unions remains inconclusive, further talks on Dec 3

ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించగా.. అందుకు రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించలేదు. కమిటీ ఏర్పాటు సమస్యకు పరిష్కారం కాదన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో చర్చలు కొలిక్కిరాకుండానే ముగిశాయి.

Recommended Video

Mann Ki Baat : New Zealand MP Takes Oath In Sanskrit ప్రతి భారతీయుడి బాధ్యత అదేనన్న PM Modi

వచ్చే గురురవారం(డిసెంబర్ 3) మరోసారి రైతులతో కేంద్రం చర్చలు జరపనుంది. అప్పటి వరకు శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు తెలిపారు. కాగా, రైతు సంఘాల ప్రతినిధులతో భేటీకి ముందు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. చర్చల నేపథ్యంలో విజ్ఞాన్ భవన్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

English summary
The meeting between the protesting farmer leaders and the Union government remained inconclusive as both the parties failed to arrive at a common understanding. Union Agriculture Minister Narendra Singh Tomar said the meeting was good and the government will continue its dialogue with the protesting farmers. The next round of talks will be held on December 3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X