వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ ఎన్నికల ముఖచిత్రం: యువకులకే పెద్ద పీట వేయనున్న బీజేపీ అధిష్టానం

|
Google Oneindia TeluguNews

ఐదురాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పటికే పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీల అధినాయకత్వాలు కూడా టికెట్ కేటాయింపులపై దృష్టి సారించాయి. అభ్యర్థులకు టికెట్ కేటాయింపుల్లో కాంగ్రెస్ గుజరాత్ కర్నాటక ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తుండగా... ఇక బీజేపీ కూడా తన సూత్రాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇక రాజస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకత లేదా వసుంధర రాజే పై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో టికెట్ కేటాయింపుల్లో బీజేపీ మరో ఉపాయం ఆలోచించింది.

 వసుంధర రాజేపై ప్రజాగ్రహం..యువకులకే టికెట్లు

వసుంధర రాజేపై ప్రజాగ్రహం..యువకులకే టికెట్లు

ఇప్పటికే వసుంధర రాజేతో పాటు పలువురు సీనియర్ మంత్రులు, సీనియర్ నేతలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కమలం పార్టీ అధినాయకత్వం దృష్టికి వచ్చింది. దీంతో రేపు పార్టీ గెలవాలంటే టికెట్లు ఎవరికి ఇస్తున్నామనేదానిపైనే ఆధార పడి ఉంటుందని భావిస్తోంది. ఇందుకోసమే ఈ సారి యువకులకే టికెట్ కేటాయింపుల్లో పెద్ద పీట వేయాలని బీజేపీ తలుస్తోంది. ఇలా చేస్తే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మారిపోతుందని బీజేపీ యోచిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉండటంతో బీజేపీ సీరియస్‌గా తీసుకుని టికెట్ కేటాయింపులను చాలా జాగ్రత్తగా చేయాలని భావిస్తోంది.

కుల సమీకరణాలపై కూడా వర్కౌట్ చేస్తున్న అధిష్టానం

కుల సమీకరణాలపై కూడా వర్కౌట్ చేస్తున్న అధిష్టానం

రాజస్థాన్ ప్రభుత్వంలో పలు రంగాల్లో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలు కూడా కమలం పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే సీనియర్ మంత్రులు, పార్టీ పెద్దలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసమే చాలా జాగ్రత్తగా రాజస్థాన్ ఎన్నికలను డీల్ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు కులసమీకరణాలపై కూడా బీజేపీ వర్క్‌ఔట్ చేస్తోంది. దీని ద్వారా పార్టీకి ఏమేరకు కలిసి వస్తుందో అనేదానిపై కూడా బీజేపీ అంచనా వేస్తోంది.

కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా సచిన్ పైలట్

కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా సచిన్ పైలట్


అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ తరపున రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సచిన్ పైలట్‌ పేరు ప్రకటించడంతో హస్తం పార్టీలోని కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కూడా బీజేపీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. అంతేకాదు కాంగ్రెస్‌లో చాలామంది కూడా సహకరించే పరిస్థితిలో కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్‌లో మరోసారి గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. దీన్నే సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.

 యువకులకు పెద్ద పీట వేసి తిరిగి అధికారంలోకి...

యువకులకు పెద్ద పీట వేసి తిరిగి అధికారంలోకి...

మరో వైపు రెండు పార్టీల్లో ఉత్సాహం కనిపించడంలేదు. దీన్ని బీజేపీ పసిగట్టింది. క్యాడర్‌లో జోష్ నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎలాగైనా సరే కాంగ్రెస్‌పై పైచేయి సాధించాలనే కసితో కమలనాథులు పనిచేసేలా వారిలో ఉత్సాహం నింపేందుకు అధినాయకత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ బీజేపీ ఇంఛార్జ్ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ రంగంలోకి దిగారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వసుంధరా రాజేనే కొనసాగుతారని చెబుతూనే... ఎమ్మెల్యే టికెట్లు మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే కొత్త ముఖాలు, యువకులకు టికెట్ కేటాయింపులు జరపడం వల్ల తిరిగి పార్టీలో జోష్ నింపుతుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.

Recommended Video

12న తుది జాబితా.. వారికి మాత్రమే ఓటు హక్కు..!

English summary
The central leadership of the Bharatiya Janata Party (BJP) feels that judicious distribution of tickets and giving tickets to dynamic and young leaders in Rajasthan can change the scenario in the state. The party claims to be working on the same line. The final call on tickets will be taken by the central leadership as they are getting reports about people’s anger against ministers and senior leaders of the state for many reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X