వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాప్తి .. ఒకరి నుండి ఎంత మందికి ? కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ అంచనా !!

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి కొందరిలో లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తూ, కొందరిలో కనిపించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపించే ఈ వైరస్ చాలా తొందరగా తన ప్రభావం చూపిస్తుంది. అందుకే దీనిని మహమ్మారి అన్నారు . కరోనా వైరస్ పై ఎన్నో పరిశోధనలు చేస్తున్న ప్రపంచ దేశాలు ఈ మహమ్మారి అంతు చూసేందుకు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. చాలా మంది వైద్య శాస్త్ర నిపుణులు , శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు.

ఇక ఇదే సమయంలో కరోనా వైరస్ గురించి భారతదేశ కేంద్రశాస్త్ర ,సాంకేతిక శాఖ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది . కరోనా ఒకరి నుంచి మరొకరికి సులువుగా విస్తరిస్తోందని చెప్తున్న క్రమంలో దీనిపై అనేక రకాలైన వార్తలు వచ్చాయి. అసలు కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరం నుండి ఎంత మందికి వ్యాప్తి చెందుతుంది అనే దానిపై ఓ అంచనాకు వచ్చింది కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ. కరోనా సోకిన వ్యక్తి నుంచి మరో ముగ్గురికి కరోనా సోకే అవకాశం ఉందని అంచనా వేసింది.

Central Science and Technology Department estimation on Corona outbreak

ఇక ఆ ముగ్గురు ఒక్కొక్కరు మరో ముగ్గురు చొప్పున వ్యాపింపజేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే క్వారంటెన్, లాక్ డౌన్, ఐసోలేషన్ తోనే దీనిని అరికట్టవచ్చు అని అభిప్రాయపడుతుంది . ఇప్పటికే లాక్ డౌన్ పాటిస్తున్న ప్రజలు బయటనుంచి వచ్చే పాల పాకెట్స్, కూరగాయలని కడిగి లోపలకు తీసుకెళ్లాలని పేర్కొంది .

Recommended Video

Kodali Nani Slams Chandrababu Naidu And Yellow Media

ఇక కరోనాను అరికట్టతంలో ప్రతి ఒక్కరు కీలకంగా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పెంపుడు జంతువులతో కరోనా ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు బాల్కనీ, టెర్రస్ పై కూర్చున్నా ప్రమాదం లేదని చెప్తుంది . మొత్తానికి సామాజిక దూరంతో కరోనాను కట్టడి చేయొచ్చు అని చెప్పిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కొంతకాలం పాటు జాగ్రత్త అవసరం అని స్పష్టం చేసింది.

English summary
The Department of Science and Technology has come to the conclusion that the actual corona virus spreads from one person's body to the next. It is estimated that three more people are likely to be infected by the person . It is possible that the three each one person could spread to another three.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X