ప్రొఫెసర్లు, లెక్చరర్లకు దీపావళి బొనాంజా: 7వ పే కమిషన్ ఫలాలు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర, యూజీసీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లకు దీపావళి పండగ ముందే వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏడో వేతన సంఘం ప్రయోజనాలను వారికీ అమలు చేయాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 7.58 లక్షల మంది ఆచార్యులకు ప్రయోజనం కలగనుంది.

'329 రాష్ట్ర విశ్వ విద్యాలయాలు, 12,912 కళాశాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు 2016, జనవరి 1 నుంచి ఏడో వేతన సంఘం ప్రయోజనాలు దక్కుతాయి. కేంద్ర నిధులుతో నడిచే డీమ్డ్‌ యూనివర్సిటీలు, 43 కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లకు ప్రయోజనాలు అందుతాయి' అని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు.

seventh pay commission

వేతనాల పెరుగుదల దాదాపు 22-28 శాతం వరకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పెంపుదల కోసం సెప్టెంబర్ నెలలో మోడీ ప్రభుత్వం 7వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో 22మంది సభ్యులున్నారు. ఇది ఇలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలు ప్రవేశ పెట్టనుంది. నైపుణ్యాభివృద్ధి కోసం సంకల్ప్‌, స్ట్రైవ్‌ పథకాలు తీసుకొస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Human Resource Development Minister Prakash Javadekar on Wednesday said that teachers of all centrally funded deemed universities and 43 central universities will get the benefit of 7th Pay Commission.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి