వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాంద్యం ఎఫెక్ట్: అసంపూర్ణ గృహ నిర్మాణాలకు రూ.10 వేల కోట్లు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

|
Google Oneindia TeluguNews

ఆర్థికమాంద్యం నుంచి బయటపడేందుకు కేంద్రప్రభుత్వం శతవిధలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆటోమొబైల్ సెక్టార్ కుదేలవడంతో.. గృహ నిర్మాణంపై కూడా ప్రభావం పడుతుందని అంచనా వేసింది. ఈ మేరకు పూర్తి కానీ ప్రాజెక్టులపై దృష్టిసారించింది. వాటిని పూర్తి చేసేందకు భారీగా నగదు ప్రకటించింది. కేంద్రంతోపాటు ఎల్ఐసీ, ఎస్బీఐ కూడా పెద్ద మొత్తం సాయం తీసుకుంటామని పేర్కొన్నది.

మాంద్యం దెబ్బకు కొన్ని గృహ నిర్మాణాల ప్రాజెక్టులు మధ్యలోనే ఆటకెక్కాయి. దీంతో వాటిని పూర్తి చేయాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అల్టర్‌నెట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఏఐఎఫ్) కింద ఈ పెట్టుబడి పెడుతున్నట్టు ఆమె వివరించారు. దీంతోపాటు ఎల్ఐసీ, ఎస్బీఐ కలిసి మరో రూ.25 వేల కోట్లు అందజేస్తాయని వెల్లడించారు. దీంతో 4.58 లక్షల యూనిట్లలో 1600 ఇళ్ల ప్రాజెక్టులు పూర్తవుతాయని అంచనా వేశారు.

Centre approves Rs 10,000 crore fund for unfinished housing projects

కేంద్రప్రభుత్వం అందజేసే నగదు, ఎస్బీఐ, ఎల్ఐసీ నుంచి తీసుకొనే మొత్తం ఏఐఎఫ్ క్యాటగిరీ -2 కిందకొస్తుందని ఆమె తెలిపారు. ఈ పథకంతో గృహ నిర్మాణాలు పూర్తవుతాయని.. మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.

దీంతో వినియోగదారులకు, యాజమానులకు కైడా ఊతం ఇచ్చినట్టవుతుందని తెలిపారు. గృహ నిర్మాణ రంగానికి కేంద్రం అందజేసే మొత్తంతో సిమెంట్, ఇనుము పరిశ్రమలు.. ఉద్యోగులకు మేలు జరుగుతుందని తెలిపారు. కీలకరంగమైన గృహనిర్మాణ రంగానికి బూస్ట్‌నివ్వడంతో ఆర్థిక మాంద్యం కొద్దిగైనా మెరుగుపడుతుందోనని లెక్కగడుతున్నారు.

English summary
The Union Cabinet on Wednesday approved setting up a special window to provide priority debt financing for completion of stalled housing projects in the affordable and middle-income housing sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X