వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్రం సన్నాహాలు- రాష్ట్రాల్లో స్టీరింగ్‌ కమిటీల ఏర్పాటు..

|
Google Oneindia TeluguNews

భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా ఎంపిక చేసిన వారికి మాత్రమే కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరుతోంది. ఇందుకోసం వివిధ అంశాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశిస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కమిటీలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడటంతో పాటు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాలను అడ్డుకునేలా ఉండాలని కోరింది.

అమెరికా ఎన్నికల తుది అంకం- ఓటింగ్‌ బేస్‌పై బిడెన్ గురి-కరోనా చర్యల సమర్ధనలో ట్రంప్...అమెరికా ఎన్నికల తుది అంకం- ఓటింగ్‌ బేస్‌పై బిడెన్ గురి-కరోనా చర్యల సమర్ధనలో ట్రంప్...

 కరోనా వ్యాక్సిన్‌ రాక ...

కరోనా వ్యాక్సిన్‌ రాక ...

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది మార్చి కల్లా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం దేశ విదేశీ పరిశోధనా సంస్ధలతో టచ్‌లో ఉంటూ నిరంతరం తాజా వివరాలను తెప్పించుకుంటోంది. వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌కు తొలి విడత కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు మూడు సంస్ధలు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. వీటి నుంచి వ్యాక్సిన్‌ రాగానే సాఫీగా దాన్ని పంపిణీ చేసేందుకు భారీ ప్రణాళిక కూడా సిద్ధం చేస్తోంది. దీని అమలులో రాష్ట్ర ప్రభుత్వాల సాయం కూడా కోరుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉన్నాయి.

 కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌..

కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌..

కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే దాన్ని పంపిణ చేసేందుకు ఓ భారీ డ్రైవ్‌ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో ఎంపిక చేసిన 30 కోట్ల మందికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపింది. వీరిని నాలుగు కేటగిరీలుగా కూడా విభజించి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో కరోనాపై పోరులో ముందున్న డాక్టర్లు, హెల్త్‌ వర్కర్లు, ఆశావర్కర్లు, పోలీసులు, వృద్ధులు, తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారు ఇలా వివిధ వర్గాలుగా విభజించింది. వీరికి దశల వారీగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగస్వాములు చేయనుంది. వ్యాక్సినేషన్‌ భారీ ప్రక్రియ కాబట్టి ఇందులో రాష్ట్రాల సహకారం కూడా కీలకంగా మారింది.

 రాష్ట్ర స్ధాయిలో కమిటీల ఏర్పాటు...

రాష్ట్ర స్ధాయిలో కమిటీల ఏర్పాటు...

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ సాఫీగా సాగేందుకు వీలుగా ప్రతీ రాష్ట్రంలోనూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రకారం టీకాలు వేసే కార్యక్రమాన్ని సమన్వయం చేయడం, మిగతా రోగులకు వైద్య సాయం అందడంలో ఇబ్బందులు లేకుండా చూడటం, వ్యాక్సిన్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాన్ని అడ్డుకోవడం లక్ష్యంగా ఈ కమిటీలు పని చేస్తాయి. ఏడాది పాటు సాగే ఈ డ్రైవ్‌లో ఈ కమిటీలదే కీలక పాత్ర అని కేంద్రం చెబుతోంది. రాష్ట్ర స్ధాయిలో ఉండే కమిటీతో పాటు జిల్లా స్ధాయిలోనూ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ, అదనపు చీఫ్‌ సెక్రటరీ లేదా వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్ధాయి టాస్క్‌ఫోర్స్‌, కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు కానున్నాయి.

English summary
The Centre has asked States to constitute committees for coordination and overseeing COVID-19 vaccination drive while ensuring minimal disruptions in other routine healthcare services, and stressed early tracking of social media to dispel rumours which could impact the community acceptance of coronavirus inoculation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X