వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియానెట్, మీడియా వన్ చానెల్‌పై 48 గంటల నిషేధం

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఘర్షణలో తప్పుడు రిపోర్ట్ చేసిన రెండు మళయాళ చానెల్లు ఆసియానెట్, మీడియా వన్‌కు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ నోటీసులు జారీచేసింది. గతనెల 25వ తేదీన ఆసియానెట్, మీడియా వన్ తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని, అందుకే నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. మీడియా వన్ చానెల్ సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 12.30 గంటల వరకు తప్పుడు కథనాలు ప్రసారం చేసిందని పేర్కొన్నది. అంతేకాదు మీడియా వన్ ఢిల్లీ కరస్పాండెంట్ హసనుల్ బన్నా రిపోర్ట్ చేసిన అంశాలను వివరించారు. పోలీసులు కూడా చేష్టలుడిగి చూశారని.. సీఏఏ అనుకూల వర్గానికి సపోర్ట్ చేశారని పేర్కొన్నారు.

 centre bans 2 malayalam channels for 48 hours..

Recommended Video

India Vs Bangladesh : CAB To Refund Money Of Last Two Days Tickets || Oneindia Telugu

ముస్లింలు ఎక్కువగా ఉండే చాంద్‌బాగ్‌లో నిరసనకారులు షాపులను ధ్వంసం చేసి, వాహనాలకు నిప్పుపెట్టారని రిపోర్ట్ చేసింది. అంతేకాదు రాళ్లు విసిరారని.. చెలరేగిన ఘర్షణలో చాలామందిని ఆస్పత్రికి తీసుకెళ్లామని.. కానీ పోలీసులు స్పందించలేదని పేర్కొన్నారు. సమాచార ప్రసారాల చట్టం ప్రకారం ఆసియానెట్, మీడియా వన్ సంస్థలకు నోటీసులు జారీచేసినట్టు తెలిపింది. మరోవైపు ఆసియానెట్ చానెల్ ఢిల్లీ ఘర్షణలో మృతుల సంఖ్యను పెంచుతూ వెళ్లిందని పేర్కొన్నది. కేంద్ర సమాచార శాఖ ఆదేశాలతో కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మీడియావన్, ఆసియానెట్ చానెళ్లపై 48 గంటలపాటు నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు మీడియా వన్ ఎండీ, ఆసియానెట్ ఎండీకి.. సమాచార ప్రసార శాఖ నోటీసులు జారీచేయగా.. దానిని కేరళ ప్రభుత్వం 48 గంటలపాటు బ్యాన్ చేస్తున్నట్టు పేర్కొన్నది.

English summary
centre bans 2 malayalam channels asianet news media one for 48 hours for coverage of delhi riots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X