వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం సంచలన నిర్ణయం: దేశ వ్యాప్త గోవధ నిషేధం, కీలక నిబంధనలు

కేంద్ర మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పశు విక్రేతలపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గోవధను నిషేధించింది. అంతేగాక, వధ కోసం పశువులను విక్రయించరాదంటూ దేశవ్యాప్తంగా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పశు విక్రేతలపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గోవధను నిషేధించింది. అంతేగాక, వధ కోసం పశువులను విక్రయించరాదంటూ దేశవ్యాప్తంగా నిషేధం విధించింది.

కేంద్రం తీసుకువచ్చిన నూతన నిబంధన ప్రకారం వ్యవసాయ భూములు ఉన్న రైతులకు మాత్రమే పశువులను విక్రయించాలి. ప్రధానిగా మోడీ అధికారం చేపట్టాక కేంద్రం స్థాయిలో గోసంరక్షణపై నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Centre bans cow-slaughter across India: Read what the tough new law states

పశు విక్రేతలపై ప్రత్యేకించి ముస్లింలపై హిందుత్వ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.
ఈ నిబంధనల ప్రకారం 'వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే పశువులను కొనుగోలు చేయాలి... వధించడం కోసం కాదు' అని కేంద్రం స్పష్టంగా పేర్కొంది.

అంతేగాక, కొనుగోలు చేసిన ఆరు నెలల వరకు మళ్లీ అమ్మకూడదని షరతులు కూడా విధించడం పశువిక్రేతలకు చెక్ పెట్టేలా ఉంది. తాను 'సేద్యకారుడిని' అని సరైన ధ్రువపత్రాలు చూపిస్తేనే ఇకపై ఆవులను విక్రయించాల్సి ఉంటుంది.

8 పేజీల మేర పలు నిబంధనలు రూపొందించిన కేంద్ర పర్యావరణ శాఖ.. లేగదూడలు, పనిచేయలేని పశువులను విక్రయించకూడదని కూడా స్పష్టం చేసింది. ప‌శు సంర‌క్ష‌ణ శాల‌లు త‌మ ద‌గ్గ‌ర ఉన్న ప‌శువుల‌ను ద‌త్త‌త‌కు ఇచ్చే ముందు కూడా లిఖిత పూర్వ‌కంగా రాసివ్వాలి. ఆవుల‌ను ప‌శువ‌ధ‌శాల‌ల‌కు అమ్మ‌డం లేద‌ని హామీ ఇవ్వాలి.

పశు విక్రయ కేంద్రాలు జాతీయ సరిహద్దుకు 50 కిలోమీటర్లలోపు, రాష్ట సరిహద్దుకు 25 కిలోమీటర్ల లోపులోనే ఉండాలని పేర్కొంది. రాష్ట్రానికి వెలుపల పశువులు విక్రయించే పక్షంలో సదరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.

English summary
The sale of cattle for slaughter has been banned by the central government. As per the new regulation, sale of cattle is allowed among farm land owners across India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X