వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాలకు కేంద్రం షాక్: జీఎస్టీ పరిహారానికి బ్రేక్, భవిష్యత్‌లో ఇవ్వలేమని ఇండికేషన్స్..

|
Google Oneindia TeluguNews

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం షాక్ ఇవ్వబోతోంది. ఇకపై జీఎస్టీ పన్నుకు సంబంధించి భవిష్యత్‌లో పరిహారం చెల్లించలేమని మంగళవారం పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపింది. రెవెన్యూ షేరింగ్ ఫార్ములా ఆధారంగా రాష్ట్రాలకు చెల్లించలేని పరిస్థితి అని.. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల పన్ను వసూల్ మందగించడమే కారణం అని ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ తెలిపారని హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది.

రాష్ట్రాల వాటా..

రాష్ట్రాల వాటా..

‘ఫైనాన్సింగ్ ద ఇన్సోవేషన్ ఏకోసిస్టమ్ అండ్ ఇండియాస్ గ్రోత్ కంపెనీస్' సమావేశంలో జీఎస్టీ పరిహారంపై చర్చ జరిగింది. సమావేశంలో మిగిలిన సభ్యులు రాష్ట్ర జీఎస్టీ పరిహారం గురించి చర్చించారు. మార్చి నెలకు సంబంధించి రాష్ట్రాలకు 13 వేల 806 కోట్లు విడుదల చేసిన మరునాడే ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019-2020లో లక్షా 65 వేల కోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే సంవత్సరం సెస్ 95 వేల 444 కోట్లు వసూలయిన సంగతి తెలిసిందే.

తగ్గిన కలెక్షన్

తగ్గిన కలెక్షన్

ఈ ఏడాది మొదటి త్రైమాసికంల 59 శాతం జీఎస్టీ వసూలైంది. అయితే గతేడాదితో పోలిస్తే 41 శాతం తగ్గింది. అయితే జీఎస్టీ చట్టం ప్రకారం రెవెన్యూ లాస్ అయిన మొదటి ఐదేళ్లు చెల్లిసతామని అమలు చేసినప్పుడు కేంద్ర మాటిచ్చింది. 2015-16లో 14 శాతం వార్షిక వృద్ది కలిగింది. రెండునెలల లెక్కన కేంద్రం పరిహారం చెల్లిస్తూ వచ్చింది.

తెలంగాణ, కేరళ.. ఇతర రాష్ట్రాలు

తెలంగాణ, కేరళ.. ఇతర రాష్ట్రాలు

జీఎస్టీ కాంపెన్‌సెషన్ తమకు సకాలంలో విడుదల చేయాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. దీనిపై గత నెలలో తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు కేంద్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశారు. రాష్ట్ర ఆదాయాలు భారీగా పడిపోయినందున నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. దీనిపై కేరళ కూడా కేంద్రాన్ని కోరింది. ఆర్థికమంత్రి థామస్ కేంద్రాన్ని విన్నవించారు.

Recommended Video

Cancel Exams - NSUI | కాలేజీలు ఓపెన్ చేయొద్దు, HRC కి ఫిర్యాదు
ఎంపీ ల్యాడ్స్ కూడా..

ఎంపీ ల్యాడ్స్ కూడా..

లాక్ డౌన్ వల్ల ఏప్రిల్, మే నెలలో ఆదాయాలు గణనీయంగా పడిపోయినందున కాంపెన్షన్ ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. లాక్ డౌన్ వల్ల స్థానికంగా ఉపయోగించే ఎంపీ ల్యాండ్స్ నిధులను కూడా కన్సాలిడేటెడ్‌గా భారత ప్రభుత్వానికి మళ్లించిన సంగతి తెలిసిందే.

English summary
Central government reportedly told a parliamentary panel on Tuesday that it cannot pay GST compensation to states in the near future due to the COVID-19 pandemic
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X