వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: మోడీ చేతిలో అస్త్రం: సీఎం పళని, పన్నీర్ స్కెచ్: దినకరన్ భారత్ పౌరసత్వం రద్దు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ చెన్నై: తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ కు షాక్ ఇవ్వడానికి ఆ పార్టీ నేతలు సిద్దం అయ్యారు.

టీటీవీ దినకరన్ కు అన్నాడీఎంకే పార్టీ నుంచి దూరం చేసి ఇప్పుడు భారత పౌరసత్వాన్ని దూరం చెయ్యడానికి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం రంగం సిద్దం చేస్తున్నారు. టీటీవీ దినకరన్ స్వయంగా సమర్పించిన అఫిడవిట్ తోనే అతన్ని దెబ్బ తియ్యాలని పాలువులు కదుపుతున్నారు.

నేను సింగపూర్ సిటిజన్

నేను సింగపూర్ సిటిజన్

విదేశీ అక్రమలావాదేవీల కేసు(ఫెరా)లో విచారణ ఎదుర్కొంటున్న టీటీవీ దినకరన్ తాను విదేశీయుడని, సింగపూర్ పౌరసత్వం ఉందని కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. విదేశాల్లో పౌరసత్వం ఉన్న టీటీవీ దినకరన్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నాడు.

టీఆర్ ఎస్ ఎమ్మెల్యే

టీఆర్ ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణలోని వేములవాడ నియోజక వర్గం టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు జర్మనీ పౌరసత్వం ఉందని వెలుగు చూడటంతో ఆయనకు భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చెన్నమనేని రమేష్ కు ఎలా జరిగిందో అలాగే టీటీవీ దినకరన్ విషయంలో దెబ్బకొట్టాలని ప్రయత్నాలు మొదలైనాయి.

టీటీవీ దినకరన్ సెల్ఫ్ గోల్ ?

టీటీవీ దినకరన్ సెల్ఫ్ గోల్ ?

టీటీవీ దినకరన్ స్వయంగా తనకు సింగపూర్ పౌరసత్వం ఉందని కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. టీటీవీ దినకరన్ కు సింగపూర్ పౌరసత్వం ఉందని, భారత పౌరసత్వం రద్దు చెయ్యాలని ఎడప్పాడివ పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం నాయకులు కోర్టును ఆశ్రయించడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

భారత్ లో ఎక్కడా పనికిరాడు

భారత్ లో ఎక్కడా పనికిరాడు

చెన్నమనేని రమేష్ కు జరిగినట్లే టీటీవీ దినకరన్ విషయంలో జరిగితే అన్నాడీఎంకే పార్టీ పదవి నుంచి బహిష్కరణకు గురైన ఆయన తమిళనాడుతో పాటు దేశంలో ఎక్కడా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హుడు అవుతాడని న్యాయనిపుణలు అంటున్నారు.

నన్ను కాపాడండి

నన్ను కాపాడండి

విషయం పసిగట్టిన టీటీవీ దినకరన్ న్యాయనిపుణలతో చర్చిస్తున్నారు. చెన్నమనేని రమేష్ కు ఎదురైన ఘటన తన వరకు రాకుండా చూడాలని తన న్యాయవాదులకు చెప్పాడని సమాచారం. మొత్తం మీద టీటీవీ దినకరన్ ను కట్టడి చెయ్యడానికి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం చేతికి మంచి అస్త్రం చిక్కిందని అన్నాడీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు.

English summary
The Centre will cancel the Dinakaran's citizenship who claimed I am Singapore citizen in Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X