• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: మరో బడా బ్యాంకు ఢమాల్ -లక్ష్మి విలాస్ బ్యాంక్‌ విత్ డ్రాలపై కేంద్రం సంచలన ఆంక్షలు

|

ఇండియాలో మరో బడా బ్యాంకు దివాళా తీసింది.. గడిచిన అర దశాబ్దకాలంగా బ్యాంకింగ్ వ్యవస్థలు ఒక్కొక్కటిగా కుప్ప కూలుతుండగా.. ఇప్పుడు లక్ష్మి విలాస్ బ్యాంక్‌ వంతు వచ్చింది. తమిళనాడు కేంద్రంగా పనిచేసే లక్ష్మి విలాస్ బ్యాంకు.. తన డిపాజిటర్ల నుంచి సేకరించిన సొమ్మును కట్టకలిపి.. అప్పుల రూపంలో బడా బాబుల చేతుల్లో పెట్టేసి.. ఆ బకాయిలను తిరిగి రాబట్టుకోలేక మూసివేత దశకు చేరింది. ప్రమాదాన్ని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం.. సదరు బ్యాంకుపై సోమవారం సంచలన ఆదేశాలిచ్చింది.

 రూ.25వేల లోపే..

రూ.25వేల లోపే..

లక్ష్మి విలాస్ బ్యాంకులోని అన్ని రకాల (సేవింగ్స్, కరెంట్, డీమాంట్) ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ(విత్ డ్రా)పై కేంద్ర ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది. బ్యాంకుపై మారటోరియం ప్రకటించిన కేంద్రం.. ఆయా ఖాతాదారులు కేవలం రూ.25వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోడానికి వీలుందని, తమ డబ్బులే అయినా, రూ.25 వేలకు మించి చెల్లింపులు ఉండబోవని తెలిపింది. ఈ నిబంధనలు డిసెంబర్ 16 వరకు అమలులో ఉంటాయని, రివ్యూ అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటనలో తెలిపారు.

మరో దారిలేకే ఆంక్షలు..

మరో దారిలేకే ఆంక్షలు..

‘‘ఇచ్చిన అప్పులు తిరిగి రాబట్టుకోగలదనే పునరుజ్జీవన ప్రణాళిక లేనప్పుడు.. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేదిశగా, అదే సమయంలో బ్యాంక్ ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తప్పనిసరైన పరిస్థితిలో.. మరో దారి లేక ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాం. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 45 ప్రకారం.. లక్ష్మి విలాస్ బ్యాంకు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలపై ఆంక్షలు విధించాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాకు(కేంద్రానికి) దరఖాస్తు చేసుకుంది. ఆర్బీఐ అభ్యర్థనను పరిశీలించిన తరువాత ఆ బ్యాంకుపై 30 రోజులపాటు ఆంక్షలు విధించాలని నిర్ణయించుకున్నాం'' అని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

కొత్త నిర్వాహకుల చేతికి బ్యాంకు..

కొత్త నిర్వాహకుల చేతికి బ్యాంకు..

విత్ డ్రాలపై తాత్కాలిక నిషేధం అమల్లోకి రావడంతో లక్ష్మి విలాస్ బ్యాంక్.. ఆర్బిఐ అనుమతి లేకుండా రూ.25 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని తన ఖాతాదారులకుగానీ, ఇతర పేమెంట్లుగానీ చేయడానికి వీల్లేదని కేంద్రం కరాకండిగా చెప్పింది. లక్ష్మి విలాస్ బ్యాంకుపై మారటోరియం విధించిన నేపథ్యంలో నిర్వహణ బాధ్యతలు చేతులు మారాయి. కెనరా బ్యాంక్ మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టిఎన్ మనోహరన్ ప్రస్తుతం లక్ష్మీ విలాస్ బ్యాంక్ నిర్వాహకుడిగా నియమితులయ్యారు.

English summary
The central government on Tuesday placed Tamil Nadu-based private sector lender Lakshmi Vilas Bank under a moratorium, capping withdrawals from its customers' accounts at ₹ 25,000 a month, the Ministry of Finance said in a statement. However, depositors will be allowed to withdraw more than ₹ 25,000 with permission from the Reserve Bank of India for purposes such as medical treatment, payment of higher education and marriage expenses, the ministry said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X