• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

coronavirus: విపత్తుగా ప్రకటించిన కేంద్రం, మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు, వారికి వైద్య ఖర్చులు

|

న్యూఢిల్లీ: దేశంలో వేగంగా వ్యాపిస్తూ ఇద్దరి ప్రాణం తీసిన ప్రాణాంతకమైన కరోనావైరస్(కొవిడ్-19)ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా గుర్తించింది. అంతేగాక, కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.

కరోనావైరస్ బారని పడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది కేంద్ర హోంశాఖ. కరోనావైరస్ సోకి మరణించిన వారి కుటుంబాలకు విపత్తు ప్రతిస్పందన నిధి ద్వారా సహాయమందించడం జరుగుతోంది.

centre Declares Coronavirus A Notified Disaster, Compensation for deaths and victims

కరోనావైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అయ్యే ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా, దేశంలో కరోనాబారినపడిన వారిసంఖ్య 84కు చేరుకుంది. ఇప్పటికే కరోనాసోకి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని బెంగళూరులో ఒకరు, దేశ రాజధాని ఢిల్లీలో మరొకరు మృతి చెందారు.

కాగా, కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. సినిమా థియేటర్లు, మాల్స్ కూడా బంద్ చేశారు. ఇప్పటి వరకు దేశంలో రెండు కరోనా మరణాలు సంభవించాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా 5500 మందికిపైగా మరణించారు. లక్ష50వేల మందికిపైగా కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇది ఇలావుండగా, పద్మ అవార్డులపైనా కరోనా ప్రభావం పడింది. ఏప్రిల్ 3న రాష్ట్రపతి భవన్‌లో జరగాల్సిన అవార్డుల ప్రదానోత్సవం కూడా వాయిదా పడింది. .

మంచిర్యాల వ్యక్తికి కరోనా..

తెలంగాణలో రాష్ట్రంలోని మంచిర్యాలలో కరోనా కలకలం రేపింది. నస్పూర్ వాసికి కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల క్రితం అతడు ఇటలీ నుంచి రావడం గమనార్హం. వచ్చిన నాటి నుంచి ఆ వ్యక్తికి జలుబు, దగ్గు, జ్వరం ఉంది. దీంతో అతడ్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడికి రక్త నమూనాలు సేకరించిన డాక్టర్లు ల్యాబ్ కి పంపారు. రిపోర్టు వచ్చిన తర్వాతే కరోనాపై నిర్ధారిస్తామని వైద్యులు తెలిపారు.ఇది ఇలావుండగా, మహారాష్ట్రలోని నాగపూర్ ఆస్పత్రి నుంచి ఐదుగురు కరోనా అనుమానితులు పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

English summary
The government has declared the novel coronavirus outbreak in the country a "notified disaster", in a move it called "a special one-time dispensation", in order to provide compensation and aid to infected people and the families of those who killed by the virus. Funds for this and other measures will be drawn from the Disaster Response Funds (SDRF) of each state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more