వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం, ఢిల్లీ సర్కారు ప్రేక్షకుల్లానే..: ఢిల్లీ అల్లర్లపై సోనియా గాంధీ ఫైర్, రాష్ట్రపతికి ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ప్రేక్షక వహిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ మండిపడ్డారు. దేశ రాజధానిలో జరిగిన విధ్వంసం, హింసపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసి వివరించినట్లు తెలిపారు. ఢిల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Recommended Video

NorthEast Delhi : Where Is The Home Minister Of The Country? | Oneindia Telugu

ఈశాన్య ఢిల్లీలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సోనియా గాంధీ ఆరోపించారు. కాగా, సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రపతిని కాంగ్రెస్ నేతలు గురువారం కలిసి ఢిల్లీ అల్లర్లపై ఫిర్యాదు చేశారు.

Centre, Delhi govt were mute spectators: Sonia Gandhi, Meets President Kovind

కేంద్రం ప్రభుత్వం తమ రాజధర్మాన్ని సక్రమంగా నిర్వహించేలా చూడాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సానుకూలంగా స్పందించారని సోనియా గాంధీ తెలిపారు. అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి తమకు హామీ ఇచ్చారని చెప్పారు.

కాగా, ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో ఆదివారం మొదలైన అల్లర్లు బుధవారం వరకు కొనసాగాయి. బుధవారం పూర్తిస్థాయిలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఢిల్లీ పోలసులతోపాటు 40 కంపెనీలకు చెందిన ఆర్మీ బెటాలియన్లు రంగంలోకి దిగాయి. బుధవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అల్లర్లు జరిగిని ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలని ఆయన స్థానికులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని ప్రకటించారు.

మూడు రోజులుగా జరిగిన అల్లర్లలో మరణించినవారి సంఖ్య 34కు చేరింది. ఇద్దరు పోలీసు అధికారులు కూడా మరణించినవారిలో ఉన్నారు. కాగా, అల్లర్లపై పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ బుధవారం ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

English summary
Centre, Delhi govt were mute spectators: Sonia Gandhi, congress Meets President Kovind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X