
Women entry into NDA : ఎన్డీఏలో మహిళల ప్రవేశానికి కేంద్రం అనుమతి-శాశ్వత కమిషన్‌కు గ్రీన్ సిగ్నల్
నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA)లోకి మహిళలకూ ప్రవేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు త్రివిధ దళాల అధిపతులు అంగీకరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భారతి సుప్రీం కోర్టుకు ఈ విషయాన్ని నివేదించారు. 'ఈ విషయాన్ని పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది... ఇకపై ఎన్డీఏలోకి మహిళలకూ ప్రవేశం ఉంటుంది.' అని ఐశ్వర్య భారతి పేర్కొన్నారు.

ఇది తరాలను మార్చే సంస్కరణ : సొలిసిటర్ జనరల్
'నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా మహిళలనూ పర్మినెంట్ కమిషన్(శాశ్వత హోదా)లోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. త్రివిధ దళాధిపతులు,కేంద్రానికి మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది తరాలను మార్చే సంస్కరణ.' అని సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భారతి పేర్కొన్నారు. ఎన్డీఏలోకి మహిళలకూ అవకాశం కల్పించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై గతంలో ఓ పిటిషన్ దాఖలవగా... అర్హులైన మహిళలను ఎన్డీఏ పరీక్ష రాసేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది.
purvimundada:
వామ్మో
ఏమిటి
ఈ
అందం
...
టాప్
లెస్
ఫొటోలతో
రెచ్చిపోతున్న
హాట్
బ్యూటీ
(ఫొటోస్)

సంతోషం వ్యక్తం చేసిన కోర్టు...
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే కౌల్ సంతోషం వ్యక్తం చేశారు.'స్త్రీ,పురుష సమానత్వం కోసం సాయుధ దళాలు మరింత కృషి చేయాలి.సాయుధ దళాల అధిపతులు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను.' అని పేర్కొన్నారు. గత విచారణలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉంటే తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. ఎన్డీఏలో మహిళల ప్రవేశానికి సంబంధించి కేంద్రం ప్రణాళికలపై అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎన్డీఏలోకి మహిళల ప్రవేశానికి అనుమతి నిరాకరించడం లింగ వివక్ష చూపడమేనని గతంలో ఇదే సుప్రీం న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఈ ఒక్క ఏడాది మినహాయింపునివ్వాలని...
ఈ ఏడాది నవంబర్ 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష జరగనుంది. అయితే ఈ ఒక్క ఏడాది ఎన్డీఏ పరీక్ష నుంచి మహిళలకు మినహాయింపునిచ్చేందుకు అనుమతినివ్వాలని కేంద్రం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది.మౌలిక సదుపాయాలకు సంబంధించిన మార్పులు చేయాల్సి ఉండటంతో ఈ ఏడాది పరీక్షకు మహిళలను మినహాయించేందుకు అనుమతినివ్వాలని కోరింది. ప్రస్తుతం ఉన్న పాలసీ ప్రకారం డిఫెన్స్ విభాగంలో మహిళలు షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లుగానే ఉంటారు. పురుషులను శాశ్వత కమిషన్‌లోకి అనుమతించినట్లే మహిళలకూ అందుకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు జోక్యంతో ఎట్టకేలకు రక్షణ విభాగంలోనూ మహిళలకు సమ న్యాయం జరగనుంది.

ప్రస్తుతం శాశ్వత కమిషన్‌లో ఎంతమంది...
భారత సైన్యంలో ప్రస్తుతం శాశ్వత కమిషన్ హోదా దక్కిన మహిళా అధికారుల సంఖ్య 424గా ఉంది. మొత్తం 615 మంది మహిళ అధికారుల్లో 424 మందికి ఈ హోదా దక్కడం గమనార్హం.సైన్యంలో మహిళల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలంటూ గత ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరుతూ మహిళా అధికారులు సుప్రీం కోర్టును మళ్లీ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పదోన్నతులు,ప్రయోజనాల విషయంలో కేంద్రం సహేతుకంగా,సముచితంగా వ్యవహరించాలని కోరుతూ లెఫ్టినెంట్ కర్నల్ ఆషు యాదవ్, మరో 10 మంది అధికారిణులు పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థాన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. సాంకేతిక, విధానపరమైన అంశాల పేరిట తమ హక్కులను పరోక్షంగా తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. మహిళా అధికారుల వాదనపై సానుకూలంగా స్పందించిన సుప్రీం... ఆ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు ప్రభుత్వం తమ పాలసీలో మార్పులు చేస్తున్నట్లు కేంద్రం సుప్రీంకు నివేదించింది.