వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో మదర్సాలు, అలర్ట్‌గా ఉండాలన్న హోంశాఖ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో జరగుతున్న హింసపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. టీఎంసీ, బీజేపీ మధ్య ఆధిపత్య పోరుతో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో కార్యకర్తలు చనిపోవడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు 144 సెక్షన్ కూడా విధించారు.

హింసపై దృష్టి ..
సార్వత్రిక ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు జరిగిన హింసపై కేంద్రం ఫోకస్ చేసింది. ఈ రెండు సందర్భాల్లో జరిగిన హింసను లెక్కగడుతుంది. ఇందులో హింస చెలరేగడానికి కారణమేంటీ ? ఎంతమంది చనిపోయారు ? ఎందరు గాయపడ్డారనే అంశంపై దృష్టిసారించింది. దీనికి సంబంధించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తున్నామని .. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్టు పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రయత్నించాలని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.

Centre has expressed concern to West Bengal govt over political violence in state

బీ అలర్ట్ ...
రాష్ట్రంలోని బర్ద్వాన్, ముర్షిదాబాద్‌లో మదరాసీలు ఉన్నాయనే సమాచారం ఉందని పేర్కొన్నారు. కొందరిని ఉగ్రవాద భావజాలం వైపు మళ్లించుకుంటుందని తెలిపారు. వారిని బంగ్లాదేశ్‌కు చెందిన జమాతే ఉల్ ముజాహీద్దిన్ సంస్థ ఉపయోగించుకుంటుందనే పక్కా సమాచారం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి .. అలర్ట్ చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం సలహాలు, సూచనలు తీసుకొని సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే జమాతే ఉల్ ముజాహీద్దిన్ అన్ని విభాగాలకు చెందిన కార్యకలపాలను 1967 చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిషేధించబడ్డాయనే విషయాన్ని గుర్తుచేశారు కిషన్ రెడ్డి.

English summary
the Centre has expressed concern to the West Bengal government over the recent political violence in the state, Union Minister of State for Home G Kishan Reddy said Tuesday. He said the information was received about a number of incidents of violence before, during and after the general election, resulting in deaths and injuries to several people, including political workers in West Bengal. "Concern on the issue was shared by the government with the state government and an advisory was issued on June 9, 2019, asking the state government to maintain law and order, peace and public tranquillity in the state," he said replying a written question.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X