వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాను వదలని కరెప్షన్ కింగ్స్ .. కేంద్రానికి 40వేల దాకా ఫిర్యాదులు , నివేదిక కోరిన మోడీ !!

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా మహమ్మారి. భారతదేశంలో గత మార్చి నుండి విజృంభిస్తున్న ఈ మహమ్మారి నేటికీ తన పంజా విసురుతూనే ఉంది. అయితే కరోనా కాలంలో కరోనా సంక్షోభాన్ని కూడా కరెప్షన్ కోసం అధికారులు వాడుకున్న తీరు దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 40 వేల దాకా ఫిర్యాదులు అందాయంటే ఎంతగా అవినీతి వేళ్ళూనుకుందో అర్ధం చేసుకోవచ్చు .

మోడీ వ్యాఖ్యలు , రైతుల డిమాండ్లు .. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో రైతులతో కేంద్రం చర్చలపై ఉత్కంఠ మోడీ వ్యాఖ్యలు , రైతుల డిమాండ్లు .. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో రైతులతో కేంద్రం చర్చలపై ఉత్కంఠ

అవినీతికి సంబంధించి కేంద్రానికి 40,000 దాకా ఫిర్యాదులు

అవినీతికి సంబంధించి కేంద్రానికి 40,000 దాకా ఫిర్యాదులు

కరోనా పేషెంట్ లకు అందించే మౌలిక వసతులు, వైద్యం, వెంటిలేటర్ సదుపాయాలతో పాటుగా, ఇతర దేశాలలో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకురావడం, లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలపై కొనసాగిన వేధింపులు మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు లక్షల్లోనే ఉన్నాయి. అందులో అవినీతి ఫిర్యాదులు 40000 ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కోవిడ్ -19 కు సంబంధించిన అవినీతికి సంబంధించి కేంద్రానికి 40,000 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని సమాచారం.

 వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల వెల్లువ .. మొత్తం 167,000 ఫిర్యాదులు

వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల వెల్లువ .. మొత్తం 167,000 ఫిర్యాదులు

ఈ ఏడాది ఏప్రిల్‌లో, కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో, కరోనాకు సంబంధించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది . ఈ పోర్టల్ కు ఇప్పటివరకు 167,000 ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తుంది . వీటిలో 150,000 కు పైగా ఫిర్యాదులు ఇప్పటికే పరిష్కరించబడ్డాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ వెబ్‌సైట్‌లో ఈ ఫిర్యాదులు నమోదు చేయబడ్డాయి
.

 లంచాలు తీసుకోవటం , నిధుల గోల్ మాల్ , వేధింపులు .. ఇలా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు

లంచాలు తీసుకోవటం , నిధుల గోల్ మాల్ , వేధింపులు .. ఇలా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు


కోవిడ్ -19 కేసులను చూసే క్రమంలో లంచాలు తీసుకోవడం, నిధుల గోల్ మాల్ కు ప్రయత్నించడం , ప్రభుత్వ అధికారుల వేధింపులు వంటివి వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అవినీతి ఫిర్యాదులలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. నవంబర్ 25 న ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ సమావేశంలో ఈ విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది.

ప్రగతి (ప్రో-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్) వివిధ మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్న 2015 లో ప్రారంభించిన ప్రభుత్వ పరిపాలనా సంస్కరణ కార్యక్రమం.

కరోనా పేరుతో దోపిడీపై నివేదిక కోరిన ప్రధాని .. 40,000 దాకా ఫిర్యాదులు

కరోనా పేరుతో దోపిడీపై నివేదిక కోరిన ప్రధాని .. 40,000 దాకా ఫిర్యాదులు

ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో
కరోనా కరప్షన్ గురించి గురించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో మరియు అవి ఏ మేరకు పరిష్కారమయ్యాయో తనకు నివేదిక కావాలని , ప్రధాని నరేంద్ర మోడీ అడిగారని తెలుస్తుంది . డేటా సమిష్టిగా ఉందని, నేడు జరిగే సమావేశంలో ఆయనకు అందజేస్తామని అధికారులు తెలిపారు.
ఏది ఏమైనా అవినీతి అధికారులు కరోనా సంక్షోభాన్ని కూడా వాడుకున్నారు. ఆసుపత్రులలో కరోనా వైద్యం పేరుతో దోపిడీకి పాల్పడ్డారు . ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే కాకుండా, కరోనా వ్యాప్తిని నియంత్రించటానికి పనిచేసిన వివిధ శాఖలలో కూడా కరోనా మహమ్మారి పేరుతో దోపిడీ కొనసాగింది. ఇక ఇదే విషయాన్ని కేంద్రానికి అవినీతిపైన అందిన దాదాపు 40,000 వరకు ఉన్న ఫిర్యాదులు స్పష్టం చేస్తున్నాయి.

Recommended Video

Karnataka bandh over Maratha board: What is open, what is closed

English summary
The Centre has received nearly 40,000 complaints dealing with corruption related to Covid-19. In April this year, the government had set up a separate portal to expeditiously address any grievances related to coronavirus pandemic and has received over 167,000 complaints so far, of which over 150,000 have been addressed. The complaints have been collated on the Department of Administrative Reforms and Public Grievances website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X