వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.80 వేల కోట్లు: కరోనా వ్యాక్సిన్ కోసం, ఏడాదిలోపు సమకూర్చాలి, పూనావాలా కామెంట్స్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభణతో యావత్ ప్రపంచం వణికిపోతోంది. చాపకింద నీరులా వైరస్ వ్యాపించింది. దీంతో దేశాలు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం తొలుత వినిపించే పేరు ఆక్స్ ఫర్డ్ కోవిషిల్డ్.. దీనిని భారత్‌లో కూడా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ప్రయోగం చేస్తోంది. అయితే పుణెకు చెందిన సీరం చైర్మన్ ఆదర్ పూనవాల్ల సంచలన ట్వీట్ చేశారు. దేశంలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే రూ.80 వేల కోట్లు కావాలని పేర్కొన్నారు.

రూ.80 వేల కోట్లు..

రూ.80 వేల కోట్లు..


కేంద్ర వైద్యారోగ్య శాఖకు రూ.80 వేల కోట్లు కావాలని పూనవాల పేర్కొన్నారు. మరి వచ్చే ఏడాదికి కేంద్ర ప్రభుత్వం వద్ద రూ.80 వేల కోట్ల నగదు అందుబాటులో ఉంటుందా అని ట్వీట్‌లో ప్రశ్నించారు. వ్యాక్సిన్ కొనుగోలు చేసి.. దేశంలో సరఫరా చేయాలంటే నగదు కావాలా అని అడిగారు. అంతేకాదు ప్రధానమంత్రి కార్యాలయానికి ఇదీ మరో చాలెంజ్‌గా మారుతుందని చెప్పారు. అయితే ఏడాది సమయం ఉన్నందున.. ఇప్పటినుంచే ప్రణాళిక రచిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. దేశంలోనే గాక విదేశాల్లో కూడా వ్యాక్సిన్ తయారీ జరుగుతోందని.. అయితే దానిని కొనుగోలు చేయడం కోసం ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోవాలని కోరారు.

సస్పెన్షన్..పునరుద్దరణ

సస్పెన్షన్..పునరుద్దరణ


ఆక్స్ ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తోన్న కోవిషిల్డ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతోంది. దీనిని ఆస్ట్రా జెనెకా భాగస్వామ్యంతో ఆక్స్ ఫర్డ్ తయారుచేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ముంబైలోని కేఈఎం, నాయర్ ఆస్పత్రుల్లో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇటు పుణెలో కూడా మరికొద్ది వారాల్లో ట్రయల్స్ ప్రారంభం కానుంది. అయితే ఇదివరకు కోవిషిల్డ్ ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌ను డీజీసీఏ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న వారికి వెన్నెముకలో సమస్య రావడంతో సస్పెన్షన్ విధించింది.

నగదు సమకూర్చుకోవాలని..

నగదు సమకూర్చుకోవాలని..


తర్వాత ఆక్స్ ఫర్డ్ నుంచి కూడా క్లియరెన్స్ రావడంతో పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ట్రయల్స్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వరకు వ్యాక్సిన్ వస్తోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రమంలో పూనవాల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యాక్సిన్ వస్తోన్న క్రమంలో.. ఇంత మొత్తంలో ఖర్చవుతుందని కామెంట్ చేశారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం నగదు సమకూర్చుకోవాలని కూడా కామెండ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

English summary
80,000 crores need: Chairman of Pune-based Serum Institute of India Adar Poonawalla took to Twitter to pose a question to thr Ministry of Health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X