వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభలో మరో మూడు కొత్త బిల్లులు... కార్మిక హక్కులను హరించేందుకేనని విపక్షాల విమర్శలు...

|
Google Oneindia TeluguNews

విపక్షాల ఆందోళన నడుమ కార్మిక చట్టాలకు సంబంధించి మూడు కొత్త బిల్లులను శనివారం(సెప్టెంబర్ 19) కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. వీటిలో వృత్తిపరమైన భద్రత-హెల్త్&వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020,ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020,సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 బిల్లులు ఉన్నాయి.

గత ఏడాది ప్రవేశపెట్టిన మూడు బిల్లులను ఉపసంహరించుకుని వాటి స్థానంలో ఈ కొత్త బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులతో పాటు గత ఏడాది చట్ట రూపం దాల్చిన వేతన బిల్లు కోడ్-2019లో మొత్తం 29 కార్మిక చట్టాలను విలీనం చేసినట్లు తెలిపారు. ఈ బిల్లుల రూపకల్పన కోసం చాలా కసరత్తు చేశామని,దీనికి సంబంధించి ఆన్‌లైన్ ద్వారా దాదాపు 6వేల కామెంట్లను పరిశీలించామని చెప్పారు.అనంతరం ఈ మూడు బిల్లులను స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించగా... మొత్తం 233 ప్రతిపాదనల్లో 174కి ఆమోదం లభించిందన్నారు.

centre introduces three labour bills in Lok Sabha amid opposition protests

మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారీ,శశి థరూర్ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించారు. మనీష్ తివారీ మాట్లాడుతూ... మునుపటి మూడు బిల్లుల ప్రాథమిక స్వరూపాన్ని మార్చి ఈ కొత్త బిల్లులను తెచ్చారని అన్నారు. కేంద్రం ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని... లోక్‌సభలో వీటిని ప్రవేశపెట్టడానికి ముందు విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ బిల్లుల కార్మికుల హక్కును తుడిచిపెడుతాయని పేర్కొన్నారు.

ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ... కేంద్రం ప్రవేశపెట్టిన వృత్తిపరమైన భద్రత-హెల్త్&వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 బిల్లులో అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు నిర్దిష్టమైన నిబంధనలేవీ అన్నారు. అంతరాష్ట్ర వలస కార్మికులకు సంబంధించి ప్రత్యేక చాప్టర్ ఏదీ లేదన్నారు. అసలు మహిళల గురించి పట్టించుకోని ఈ బిల్లులు వారి పట్ల వివక్షకు నిదర్శనమన్నారు.

Recommended Video

BJP Didn’t Fight Nizam, Congress Did, Says Uttam Kumar Reddy | Oneindia Telugu

ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 బిల్లుతో కార్మికుల హక్కులకు భంగం కలుగుతుందన్నారు. ఇది కార్మికుల సమ్మె హక్కును తీవ్రంగా పరిమితం చేస్తుందని అన్నారు. సీపీఐ(ఎం) సభ్యుడు ఎం షరీఫ్ కూడా ఈ బిల్లులను వ్యతిరేకించారు. బిల్లులను స్టాండింగ్ కమిటీకి పంపించాలన్నారు.

English summary
The government on Saturday introduced three bills related to labour laws, including on industrial relations, in the Lok Sabha amid opposition from the Congress and few other parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X