వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ -డిసెంబర్ 1 నుంచి కంటైన్మెంట్ ఇంకా కఠినంగా -ముఖ్యాంశాలివే

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కొత్తగా మరో 44,376 కేసులు,481 మరణాలు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 92లక్షలకు, మరణాల సంఖ్య 1.34లక్షలకు పెరిగాయి. చలికాలంలో వైరస్ మరింతగా విజృంభించే అవకాశాలుండటంతో సర్వత్రా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. కొవిడ్-19 కొత్త గైడ్ లైన్స్ ను కేంద్ర హోం శాఖ బుధవారం విడుదల చేసింది.

Recommended Video

New Covid-19 Guidelines : కఠినంగా Containment Zones.. లాక్‌డౌన్ విధించ‌రాదు..!!

బీజేపీ భారీ స్ట్రోక్: పవన్‌, జగన్‌కు షాక్ -దాసరికే తిరుపతి టికెట్! -పనబాకకు చంద్రబాబు ఝలక్?బీజేపీ భారీ స్ట్రోక్: పవన్‌, జగన్‌కు షాక్ -దాసరికే తిరుపతి టికెట్! -పనబాకకు చంద్రబాబు ఝలక్?

డిసెంబర్ 1 నుంచి 31వరకు అన్ని రాష్ట్రాలు, యూటీలు అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.. ప్రోటోకాల్ ప్ర‌కారం అంతటా కరోనా టెస్టింగ్ నిర్వ‌హించాలి. స్థానిక జిల్లా, మున్సిప‌ల్ పోలీసులు అధికారులు.. క‌ఠినంగా ఆంక్ష‌లు అమ‌లు అయ్యేలా చూడాలి. అంతేకాదు

Centre issues new Covid-19 guidelines for states, forbids local lockdowns

కంటేన్మెంట్ జోన్ల‌లో క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్నారు. కోవిడ్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని క‌చ్చితంగా పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కంటోన్మెంట్ జోన్ల‌లో కేవ‌లం అత్య‌వ‌స‌ర కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. కంటోన్మెంట్ లేని జోన్ల‌లో లాక్‌డౌన్ విధించ‌రాదు అని రాష్ట్రాల‌కు కేంద్రం ఆదేశించింది. నిర్దేశించిన మేరకు నియంత్రణ చర్యలు కచ్చితంగా అమలయ్యేలా ఆయా జిల్లాల యంత్రాంగాలు,మున్సిపల్ అధికారులు బాధ్యత వహించాలి. రాష్ట్రప్రభుత్వాలు కూడా జవాబుదారీగా ఉండాలి.

జల్లికట్టు.. ఈసారైనా ఆస్కార్ పట్టు -ఉత్తమ విదేశీ కేటగిరీకి భారత్ ఎంట్రీగా మలయాళ సినిమా 'జల్లికట్టు'జల్లికట్టు.. ఈసారైనా ఆస్కార్ పట్టు -ఉత్తమ విదేశీ కేటగిరీకి భారత్ ఎంట్రీగా మలయాళ సినిమా 'జల్లికట్టు'

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో నిఘా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేంద్ర హోంశాఖ చెప్పింది. పాజిటివ్ తేలిన కేసుల‌కు సంబంధించిన కాంటాక్ట్ లిస్టింగ్ చేయాల‌ని సూచించింది. ట్రాకింగ్‌, ఐడెంటిఫికేష‌న్‌, క్వారెంటైన్ చేయాల‌ని సూచించింది. 72 గంట‌ల్లోనే 80 శాతం కాంటాక్ట్‌ల‌ను ట్రేస్ చేయాలని పేర్కొంది. ఇటీవ‌ల కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగిన నేప‌థ్యంలో.. క‌ఠిన‌మైన కంటోన్మెంట్ ఆంక్ష‌ల‌ను పాటించాల‌ని తెలిపింది.

కేంద్ర హోం శాఖ అనుమతితో అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతిస్తారు. నాన్ కంటైన్మెంట్ జోన్లలో సినిమా హాళ్ళు, థియేటర్లు 50 శాతం పరిమితో తెరుచుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో క్రీడాకారుల శిక్షణకు మాత్రమే అనుమతి ఉంటుంది. సామాజిక, మతపరమైన, సాస్కృతిక సమావేశాల్లో 200 మందిలోపే పాల్గొనాలి. సమావేశాలు జరిగే హాలులో 50 శాతం మాత్రమే అనుమతించాలి.

పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువ ఉన్న నగరాల్లో.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పనివేళలను మార్చాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. డిసెంబ‌ర్ ఒక‌టి నుంచి డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఈ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు అమ‌లులో ఉంటాయ‌ని కేంద్ర హోంశాఖ తెలిపింది. కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎనిమిది రాష్ట్రాల సీఎంలతో కాన్ఫరెన్స్ నిర్వహించగా, అందులో వ్యక్తమైన అభిప్రాయల మేరకు, కేంద్ర హోం శాఖ బుధవారం కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసింది.

English summary
The centre on Wednesday asked states to step up measures to contain the spread of coronavirus cases, suggesting they strictly enforce restrictions in containment zones, step up contact tracing and encourage "covid-appropriate" behaviour. States cannot impose local lockdowns, it said. The Home Ministry issued a set of guidelines that will be effective from December 1 and whose focus "to consolidate the substantial gains that have been achieved against the spread of COVID-19".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X