వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకాశ్మీర్‌లో లేహ్: ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లేహ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో చూపకుండా జమ్మూకాశ్మీర్‌‌లో నేపథ్యంలో ట్విట్టర్‌కు నవంబర్ 9న కేంద్రం నోటీసులు జారీ చేసింది. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరపర్చినందుకు మీపై ఎందుకు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ట్విట్టర్‌ను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటీసులో పేర్కొంది.

ఈ నోటీసును ట్విట్టర్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌కు భారత జాతీయ సైబర్ కో-ఆర్డినేషన్ సెంటర్ డైరెక్టర్ ద్వారా పంపినట్లు ది ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన ఒక నివేదిక తెలిపింది.

Centre Issues Notice to Twitter for Showing Leh as Part of Jammu & Kashmir Instead of Ladakh Union Territory

కాగా, 'ప్రజా సంభాషణకు సేవ చేయడానికి భారత ప్రభుత్వం, ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం చేయడానికి ట్విట్టర్ కట్టుబడి ఉంది. మేము ఈ లేఖకు తగిన విధంగా స్పందించాము, మా సుదూరంలో భాగంగా జియో-ట్యాగ్ సమస్యకు సంబంధించిన తాజా పరిణామాలతో సమగ్ర నవీకరణను పంచుకున్నాము' అని ట్విట్టర్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఇదిఇలావుంటే, ఇంతకుముందు లేహ్‌ను చైనాలో భాగంగా చూపించింది ట్విట్టర్, దీంతో సమాచార మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన అభ్యంతరాన్ని ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సేకు వ్యక్తం చేశారు. దీనికి ప్రతిస్పందనగా, ట్విట్టర్ లోపాన్ని సరిచేసింది. అయితే కేంద్ర భూభాగం లడఖ్‌లో భాగంగా లేహ్‌ను చూపించింది. ఇది ఇంకా మ్యాప్‌ను సరిచేయలేదు.

మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీ రాసిన మునుపటి లేఖలో.. భారతదేశ పటాన్ని తప్పుగా పేర్కొన్నారని, దాన్ని సరిచేయాలని ట్విట్టర్‌ను కోరింది. లేహ్ నగరం లడఖ్ ప్రధాన భూభాగమని.. డోర్సేకి గుర్తుచేసింది. లడఖ్,జమ్మూకాశ్మీర్ రెండూ భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగాలు అని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం చేత పాలించబడుతున్నాయని తెలిపింది.

ఇటువంటి తప్పుడు ప్రచారం ట్విట్టర్ ప్రతిష్టను దెబ్బతీస్తుందని సాహ్నీ హెచ్చరించారు. ప్రభుత్వం తరపున భారతీయుల సున్నితత్వాన్ని గౌరవించాలని కోరారు. భారతదేశం సార్వభౌమత్వాన్ని, సమగ్రతను అగౌరవపరిచేందుకు సోషల్ మీడియా దిగ్గజం చేసే ఏ ప్రయత్నమూ ఆమోదయోగ్యం కాదని, చట్టవిరుద్ధమని సాహ్నీ తేల్చి చెప్పారు.

English summary
The central government on November 9 issued notice to Twitter for showing Leh as part of Jammu and Kashmir instead of the Union Territory of Ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X