వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ 5.0 కు సన్నాహాలు ? మరో రెండు వారాల పొడిగింపు- కేంద్రం సంకేతాలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా కేంద్రం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తోనూ సంప్రదింపులు జరుపుతోంది. మే 31న మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు.

ఇదే చివరి లాక్ డౌన్- ఇప్పటికే లక్ష్యం నెరవేరింది- కేంద్రం సంకేతాలు...ఇదే చివరి లాక్ డౌన్- ఇప్పటికే లక్ష్యం నెరవేరింది- కేంద్రం సంకేతాలు...

లాక్ డౌన్ 5.0 తప్పదా ?

లాక్ డౌన్ 5.0 తప్పదా ?

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నానాటికీ పెరిగిపోతున్న కరోనా కేసులే ఇందుకు కారణం. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కేసులు పెరిగితే తిరిగి ఆంక్షలు విధిస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కేసులు పెరుగుతున్న చోట్ల లాక్ డౌన్ పొడిగించి ఆంక్షలు కట్టుదిట్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 70 శాతం కేసులున్న 11 నగరాలపై ఫోకస్...

70 శాతం కేసులున్న 11 నగరాలపై ఫోకస్...


దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ 4.0 కొనసాగుతున్నప్పటికీ ప్రధానంగా 11 నగరాల్లో మాత్రమే 70 శాతం కేసులు నమోదయ్యాయి. దీంతో వీటిపై మరింత ఫోకస్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో డిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్ కతా, పూణే, థానే, జైపూర్, జైపూర్, సూరత్ ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ రోజువారీ కేసుల నమోదు సంఖ్య అధికంగా ఉంటోంది. ఇవన్నీ మెట్రో నగరాలే కావడం, భారీగా పరీక్షలు కూడా జరుగుతున్నందున లాక్ డౌన్ కొనసాగించడమే మంచిదని కేంద్రం భావిస్తోంది.

 భారీగా పెరిగిపోతున్న కేసులు..

భారీగా పెరిగిపోతున్న కేసులు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. గత రెండు వారాల్లో కేసుల సంఖ్య దాదాపు రెట్టింపయింది. గత 16 రోజుల్లో మరణాల రేటు కూడా దాదాపు రెట్టింపయింది. రెండు నెలల పాటు లాక్ డౌన్ విధించినా ఎలాంటి పురోగతి లేకపోగా మరిన్ని కేసులు, మరణాలు చోటు చేసుకోవడం కేంద్రాన్ని కలవరపెడుతోంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాల దృష్ట్యా చూస్తే పరిస్ధితి విషమిస్తే కేంద్రం కూడా చేతులెత్తేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ముందుజాగ్రత్తగా లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

YSR Rythu Bharosa : Another Good News For AP Farmers,Govt Will Dig Borewells For Farming
లాక్ డౌన్ 5.0లో మరిన్ని సడలింపులు..

లాక్ డౌన్ 5.0లో మరిన్ని సడలింపులు..

జూన్ 1 నుంచి లాక్ డౌన్ 5.0 అమలు చేయాల్సిన పరిస్ధితుల్లో దేవాలయాలు, మసీదులు, చర్చిలతో పాటు జిమ్ లు, ప్రభుత్వ కార్యాలయాలను కూడా తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం జూన్ 1 నుంచి ప్రార్ధనాలయాలను తెరుస్తామని ప్రకటించింది. అయితే మాల్స్, సినిమాహాళ్లు, విద్యాసంస్దలతో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాలన్నింటిలోనూ లాక్ డౌన్ కొనసాగుతుందని తెలుస్తోంది.

English summary
central govt plans to extend the coronavirus lockdown by two more weeks. in wake of latest cases recorded in major cities centre shall go for lockdown 5.0, according to sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X