• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పౌరసత్వ సవరణ బిల్లు: రాజ్యసభలో గట్టెక్కుతుందా..? శివసేన ఎటువైపు

|

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్న వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బిల్లును పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ముస్లింయేతర మతాలకు చెందిన వారికి మాత్రమే భారతపౌరసత్వం ఇచ్చేలా బిల్లును సవరించడంపై పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ దీన్ని పాస్ చేయించేందుకే మోడీ సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే బుధవారం కేంద్ర కేబినెట్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఈ బిల్లును పాస్ చేసి బీజేపీ తాము ఇచ్చిన హామీని మరొకటి నిలబెట్టుకోవాలని భావిస్తోంది. అయితే రాజ్యసభలో బిల్లుకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా ప్రభుత్వం పక్కాగా అడుగులు ముందుకు వేస్తోంది.

 వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు

వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు

వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో మోడీ సర్కార్ ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. సోమవారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ చెప్పారు. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చి స్థిరపడిన ముస్లింయేతర ప్రజలకు భారత పౌరసత్వం లభించేలా సవరణలు చేసింది కేంద్రం. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారని విలేఖరులు మంత్రి ప్రకాష్ జవడేకర్‌ను అడుగగా... దేశ ప్రయోజనాల దృష్ట్యా వారంతా బిల్లును స్వాగతిస్తారని చెప్పారు.

రాజ్యసభలో బిల్లు క్లియర్ అవుతుందా..?

రాజ్యసభలో బిల్లు క్లియర్ అవుతుందా..?

లోక్‌సభలో బీజేపీ సర్కార్‌కు పూర్తి మెజార్టీ ఉన్నందున పౌరసత్వ సవరణ బిల్లు పాస్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎటొచ్చి రాజ్యసభలోనే బిల్లును పాస్ చేయాలంటే మోడీ సర్కార్ కాస్త శ్రమించాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి పూర్తిస్థాయిరలో నంబర్స్ లేవు. మరోవైపు బిల్లు వివాదాస్పదంగా ఉన్నందున బీజేపీ మిత్రపక్షాలు లేదా ఎన్డీయే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. పౌరసత్వ బిల్లుకు ఎన్డీయే కూటమిలోని పార్టీలు కొన్ని వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే వారి సొంత రాష్ట్రంలో ఆయా పార్టీలకు ఒక వర్గం ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించి వెనక్కు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు బిల్లులోని అంశాలను చూస్తే దేశంలోకి ప్రవేశించిన ముస్లింలను తిరిగి తమ దేశాలకు పంపేలా ఉందని ఇది రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

 ఈ సారి రాజ్య సభలో ఎవరు ఆదుకుంటారు..?

ఈ సారి రాజ్య సభలో ఎవరు ఆదుకుంటారు..?

గతంలో ఒక బిల్లును పాస్ చేయాలంటే బీజేపీకి సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పుడు కమలనాథులు బీజేడీ, అన్నాడీఎంకే పార్టీల సహకారం తీసుకున్నారు. కానీ మిత్రపక్షంలో ఉన్నప్పటికీ కొన్ని బిల్లులకు జేడీయూ మద్దతు ఇవ్వలేదు పైగా సభ నుంచి వాకౌట్ చేసి పరోక్షంగా బీజేపీకి సహకరించింది. అయితే ఈ వివాదాస్పద బిల్లును పాస్ చేయించేందుకు ఏ పార్టీలు మద్దతు ఇస్తాయో వేచిచూడాల్సి ఉంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంతో పాటు మరికొన్ని ఇతర పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. మత ప్రాతిపదికన ఒక వ్యక్తికి పౌరసత్వం ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి ఈ పార్టీలు. మతప్రాతిపదికన ఏర్పడిన దేశం పాకిస్తాన్‌ అని మహాత్మాగాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పినట్లుగా జాతీయతను మతం ఆధారంగా నిర్ధారించరాదనే విషయాన్ని కాంగ్రెస్ నేత శశి థరూర్ గుర్తు చేశారు.

 సుప్రీంకోర్టుకు వెళతామన్న తరుణ్ గొగోయ్

సుప్రీంకోర్టుకు వెళతామన్న తరుణ్ గొగోయ్

మరోవైపు కేంద్రం తన మంకుపట్టు వీడకుంటే సుప్రీంకోర్టుకు న్యాయంకోసం వెళతామని అస్సోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగవిరుద్ధమని, లౌకికత్వ విలువలకు వ్యతిరేకంగా ఉందని తరుణ్ గొగోయ్ అన్నారు. అందరం సమానమే అన్న రాజ్యాంగ ప్రొవిజన్‌ను కొత్త బిల్లు ఉల్లంఘించేలా ఉందని చెప్పారు. మతం, కులం, జాతి ఆధారంగా పౌరసత్వం ఉండరాదని ఆయన ట్వీట్ చేశారు.

 కేసీఆర్ జగన్‌ల వైఖరి ఎలా ఉంది..?

కేసీఆర్ జగన్‌ల వైఖరి ఎలా ఉంది..?

బీజేపీ మిత్రప్రక్షాలు స్థానిక పార్టీలు బిల్లుపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. వారికి అక్కడున్న ఓటు బ్యాంకు ప్రధాన సమస్యగా మారింది. ఇదిలా ఉంటే రాజ్యసభలో 122 మంది సభ్యులు బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.అంతేకాదు త్వరలో మరిన్ని పార్టీలు బిల్లుకు మద్దతు ఇస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పెద్దల సభలో 238 మంది ఉన్నారు. అంతేకాదు బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా నవీన్ పట్నాయక్, కేసీఆర్, జగన్‌లను విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఓటింగ్ సందర్భంగా బీజేపీ మిత్రపక్షాలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జేడీయూ బిల్లుకు సపోర్ట్ చేసేలా కనిపిస్తోంది.

 శివసేన సంగతేంటి.. మద్దతు ఇస్తుందా.. లేక.?

శివసేన సంగతేంటి.. మద్దతు ఇస్తుందా.. లేక.?

ఇక ఈ మధ్యే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన పార్టీ బిల్లుకు మద్దతు ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్ ‌గా మారింది. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో తలెత్తిన విబేధాలతో శివసేన ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగింది. ప్రస్తుతం ఎన్సీపీ కాంగ్రెస్‌లతో శివసేన జతకట్టింది. దేశ భద్రత దృష్ట్యా దేశ ప్రయోజనాల దృష్ట్యా శివసేన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. బంగ్లాదేశ్ పాకిస్తాన్‌ల నుంచి అక్రమంగా వచ్చేవారిని వెల్లగొట్టాల్సిందే అని రౌత్ అన్నారు.అయితే ఓటు వేస్తారా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు గిరిజన ప్రాంతాలకు బిల్లులో మినహాయింపు ఇస్తే సపోర్ట్ ఇచ్చేందుకు బీజేడీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. బీజేడీకి ఆరుమంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The BJP is likely to move the much-debated Citizenship (Amendment) Bill in the Parliament over the next week and is making efforts to ensure that the lack of majority in Rajya Sabha does not become an obstacle in its dream to fulfill a key election promise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more