• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టెలికాం సంస్కరణలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్-100 శాతం FDI, స్ప్రెక్ట్రమ్ ఛార్జీల మారటోరియం

|

కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరిన్ని టెలికాం రంగ సంస్కరణలకు పచ్చజెండా ఊపింది. ఇందులో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పచ్చజెండా ఊపడంతో పాటు టెలికాం సంస్ధలకు నాలుగేళ్ల పాటు స్ప్కెక్ట్రమ్ ఛార్జీల బకాయిల చెల్లింపుపై మారటోరియడం విధించడం వంటి చర్యలు ఉన్నాయి. దీంతో టెలికాం సంస్ధలకు భారీగా ఊరట లభించబోతోంది.

Hansika Motwani: సన్యాసులను సైతం నిద్ర పోకుండా చేస్తున్న హాట్ బ్యూటీ.. బికినీతో అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ...(ఫొటోస్)Hansika Motwani: సన్యాసులను సైతం నిద్ర పోకుండా చేస్తున్న హాట్ బ్యూటీ.. బికినీతో అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ...(ఫొటోస్)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో టెలికాం రంగానికి సంబంధించి 9 నిర్మాణాత్మక సంస్కరణలు, 5 ప్రక్రియ సంస్కరణలను ఆమోదించారు.. టెలికాం రంగం కోసం తీసుకున్న నిర్ణయాలలో, అత్యంత ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి హేతుబద్ధం చేయబడిన స్పెక్ట్రం యూజర్ ఛార్జ్. స్పెక్ట్రం వినియోగ ఛార్జీల్ని హేతుబద్ధం చేస్తూ కేంద్రం ఇవాళ నిర్ణయం తీసుకుంది. వార్షిక వినియోగం ఆధారంగానే స్పెక్ట్రమ్ ఛార్జీల్ని టెలికాం సంస్ధలపై విధించబోతున్నారు. అలాగే ఈ స్పెక్ట్రమ్ ను ఇతర సంస్ధలతో పంచుకునే అవకాశం కూడా కల్పించారు. దీంతో తీవ్ర ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్న టెలికాం రంగానికి ఇది పెద్ద ఊరటగా మారనుంది.

Centre mega boost to Telecom Sector with 100 FDI, four year moratorium on AGR Dues

మరోవైపు AGR హేతుబద్ధీకరణ, భవిష్యత్ స్పెక్ట్రమ్ వేలంలో స్పెక్ట్రమ్ కోసం సేకరించిన స్పెక్ట్రం వినియోగ ఛార్జీని (SUC) మినహాయించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాక, లైసెన్స్ ఫీజు (LF), ఇతర సారూప్య లెవీలకు వ్యతిరేకంగా BG అవసరాలను భారీగా తగ్గించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భవిష్యత్ వేలం కోసం, స్పెక్ట్రమ్ గడువును 20 నుండి 30 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్ వేలంలో పొందిన స్పెక్ట్రం కోసం 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రం తిరిగి అప్పగించడానికి అనుమతించనున్నారు.

YS Sharmila: చిన్నారి చైత్ర పేరంట్స్‌కు షర్మిల పరామర్శ (ఫోటోలు)YS Sharmila: చిన్నారి చైత్ర పేరంట్స్‌కు షర్మిల పరామర్శ (ఫోటోలు)

రేటింగ్ ఏజెన్సీ ICRA ప్రకారం, భారతదేశంలో టెలికాం కంపెనీల రుణాలు సుంకాలు పెంచినప్పటికీ మార్చి 2022 నాటికి వారి రుణ స్థాయిలు రూ. 4.7 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (VI) వంటి కొన్ని టెలికాం సంస్థలు పెండింగ్‌లో ఉన్న AGR బకాయిలలో భాగంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉన్నందున ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. టాటా టెలీ సర్వీసెస్‌తో పాటు రెండు ప్రధాన టెల్కోలు 10 విడతలుగా మార్చి 31, 2031 లోగా తమ బకాయిలను క్లియర్ చేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.

ప్రస్తుతం, టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా మొత్తం బకాయి రూ .1.92 ట్రిలియన్లుగా ఉంది. ఇందులో AGR బకాయిగా ప్రభుత్వానికి 58,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన మొత్తంలో స్పెక్ట్రం సంబంధిత బకాయిలు, బ్యాంక్ రుణాలు ఉన్నాయి. జూలైలో, సుప్రీంకోర్టు టెలికాం శాఖ డిమాండ్ చేసిన దానికంటే తక్కువగా ఉన్న స్వీయ-అంచనా AGR బకాయిల చెల్లింపును అనుమతించాలన్న టెల్కో విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కానీ ఇప్పుడు కేంద్రం హేతుబద్ధీకరణ నిర్ణయంతో ఆయా సంస్ధలకు ఊరట దక్కనుంది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న టెలికాం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ ఇవాళ తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా ఉపయోగపడతాని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అదే సమయంలో పార్లమెంటుతో సంబంధం లేకుండా వందశాతం ప్రత్యక్ష పెట్టుబడులకు తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.

English summary
the union government on today given nod for more telecom reforms including 100 percent fdi and four year moratorium on agr dues etc..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X