వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏపై కేంద్రం సంచలన నిర్ణయం.. నాన్ బీజేపీ ముఖ్యమంత్రులకు భారీ షాక్

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు సంబంధించి మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రాలను బైపాస్ చేస్తూ చేస్తూ సీఏఏను ఇంప్లిమెంట్ చేయాలని కేంద్రం భావింస్తున్నది. అందులో భాగంగానే రాష్ట్రాలకు సంబంధం లేకుండా.. సీఏఏ ప్రక్రియను ఆన్ లైన్ ద్వారా చేపట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన కీలక అధికారులు మంగళవారం ఈ విశయాన్ని వెల్లడించారు.

 ఎలా చెయ్యబోతున్నారంటే..

ఎలా చెయ్యబోతున్నారంటే..

రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండానే సీఏఏ అమలుకు కేంద్రం పక్కాగా అడుగులు వేస్తున్నట్లు హోం శాఖ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ద్వారా లేదంటే అదే స్థాయిలో ఒక పోస్టును క్రియేట్ చేసి, ఆ అధికారి ద్వారా ఆయా రాష్ట్రాల్లో పౌరసత్వం పొందగోరేవాళ్ల అప్లికేషన్లు స్వీకరిస్తామని, సదరు అధికారి ఎంక్వైరీ చేసిన తర్వాత దరఖాస్తుదారు వివరాల్ని ఆన్ లైన్ లోకి అప్ లోడ్ చేస్తారని, ఈ ప్రాసెస్ లో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండబోదని వివరించారు.

ముఖ్యమంత్రులకు షాకిస్తూ..

ముఖ్యమంత్రులకు షాకిస్తూ..

2017 తర్వాత రాష్ట్రాల్లో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోవడం, పెద్ద రాష్ట్రాలు ఒక్కొక్కటిగా బీజేపీ కోల్పోవడం తెలిసిందే. ప్రస్తుతం మెజార్టీ రాష్ట్రాల్లో నాన్ బీజేపీ ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ మొదలుకొని పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాము సీఏఏను అమలు చేయబోమని ఖరాఖండిగా చెప్పారు. సీపీఎం అధికారంలో ఉన్న కేరళలో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ ఈ మేరకు తీర్మానం కూడా చేసింది. దీనికి ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి కూడా మద్దతు పలికింది.

రాష్ట్రాలకు ఆ హక్కులేదు..

రాష్ట్రాలకు ఆ హక్కులేదు..

కేంద్రం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని చెప్పే హక్కు రాష్ట్రాలకు లేనేలేదని హోం మంత్రిత్వ శాఖ అధికారులు అన్నారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ లో ఈ మేరకు స్పష్టమైన విధివిధానాలున్నాయని, డిఫెన్స్, విదేశాంగ విధానం, రైల్వేలు, సిటిజన్ షిప్, న్యాచురలైజేషన్ కు సంబంధించిన వ్యవహారాలన్నీ కేంద్రం పరిధిలోకే వస్తాయని, వాటికి సంబంధించిన చట్టాల్ని రాష్ట్రాలు విధిగా పాటించాల్సి ఉంటుందని అధికారులు గుర్తుచేశారు.

ఆందోళనలకు ఆజ్యం పోసినట్లేనా?

ఆందోళనలకు ఆజ్యం పోసినట్లేనా?

డిసెంబర్ 12 నుంచి మొదలైన సీఏఏ వ్యతిరేక నిరసనలు ఒక దశలో తారాస్థాయికి చేరడం, దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో సుమారు 30 మంది చనిపోయారు. వందలమంది గాయపడగా, వేలకొద్దీ అరెస్టులు, పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. రెండు మూడు రోజులుగా ఆందోళనలు తగ్గుముఖంపడుతున్న క్రమంలో కేంద్రం తాజా నిర్ణయం అగ్గికి ఆజ్యం పోసినట్లవుతుందేమోననే భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రాలను బైపాస్ చేసేలా కేంద్రం వ్యవహరిస్తే నాన్ బీజేపీ సీఎంలు కచ్చితంగా వ్యతిరేకిస్తారని విశ్లేషకులు అంటున్నారు.

ఐడెంటిటీ లేకున్నా పౌరసత్వం

ఐడెంటిటీ లేకున్నా పౌరసత్వం


పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లో మైనార్టీలుగా ఉంటూ, మతపరమైన హింస తట్టుకోలేక ఇండియాకు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వ కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్రం సీఏఏను రూపొందించింది. అయితే చట్టంలో ముస్లిలకు చోటుకల్పించకపోవంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్త నేషనల్ రిజిస్టర్ ఆప్ సిటిజన్(ఎన్ఆర్సీ)కి సీఏఏ తొలి అడుగని.. ఎన్ఆర్సీలో విదేశీయులుగా తేలినవాళ్లలోహిందువులు, ఇతర మతస్తులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పిస్తారని, తద్వారా ముస్లింలు దేశంలేనివాళ్లుగా డిటెన్షన్ సెంటర్లలో బతకాల్సి వస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది.

 మోడీ, అమిత్ షా పట్టు..

మోడీ, అమిత్ షా పట్టు..

సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా మొదటి నుంచీ పట్టుదలగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో దానిపై అవగాహన కల్పించేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. స్వయంగా మోదీనే ‘ఇండియా సపోర్ట్స్ సీఏఏ' ప్రచారాన్ని ప్రారంభించారు. సీఏఏను ఎన్ఆర్సీతో కలిపి చూడొద్దని కేంద్రం పదేపదే చెబుతున్నా ప్రతిపక్ష పార్టీలు మాత్రం విశ్వసించడంలేదు.

English summary
The Centre is likely to make the entire process of granting citizenship under the Citizenship Amendment Act online to bypass states, some of which are dead set against the new legislation, officials said on Tuesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X