వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోషల్‌ మీడియా, ఓటీటీల కట్టడికి కేంద్రం రెడీ- ఐటీ చట్టంలో మార్పులు-త్వరలో ఆంక్షలు

|
Google Oneindia TeluguNews

భారత్‌లో సోషల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కట్టడికి కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే సోషల్‌ మీడియా గ్రూపులు, యాప్‌లతో పాటు ఓటీటీల్లో పెట్టే సమాచారానికి అసలు బాధ్యులెవరో నిర్ణయించే అవకాశం ఉంటుంది. అప్పుడు వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే తమను సంప్రదించకుండా కేంద్రం దూకుడుగా ముందుకెళ్లడంపై ఆయా సంస్ధలు గగ్గోలు పెడుతున్నాయి.

 త్వరలో సోషల్‌ మీడియా, ఓటీటీపై ఆంక్షలు

త్వరలో సోషల్‌ మీడియా, ఓటీటీపై ఆంక్షలు

విస్తృతమైన జనాభా, మార్కెట్‌ కలిగిన భారత్‌లో సెన్సార్ లేని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌, ఓటీటీల ద్వారా జనంలోకి చేరుతున్న అభ్యంతరకర సమాచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అనుచితమైన కార్యక్రమాలు, వీడియోల ద్వారా విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోషల్‌ మీడియా ముసుగులో అసలు మీడియా కంటే ఎక్కువగా సమాచార వ్యాప్తి జరుగుతున్న తరుణంలో వీటిపై నియంత్రణ లేకపోతే విపరిణామాలు తప్పవనే ఆందోళన ఎప్పటినుంచో ఉంది. తాజాగా చోటు చేసుకున్న రైతు నిరసనలు, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో తక్షణం వీటిపై నియంత్రణ విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలో ప్రకటన రానుంది.

ఐటీ చట్టానికి కేంద్రం సవరణలు

ఐటీ చట్టానికి కేంద్రం సవరణలు

ప్రస్తుతం భారత్‌లో విచ్చలవిడిగా విస్తరించిన సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను నియంత్రించాలంటే ప్రస్తుతం ఉన్న చట్టాలు సహకరించవు. అందుకే ఐటీ చట్టంలో భారీ మార్పులు చేయడం ద్వారా వీటిపై నియంత్రణ సాధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో ఐటీ చట్టంలో చేయాల్సిన మార్పులపై ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అమల్లోకి తెచ్చే కొత్త నిబంధనల పరిధిలోకి సోషల్ మీడియా సంస్ధలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లు, ఇతర భాగస్వాములను కూడా తీసుకురానున్నారు. అయితే తమను సంప్రదించకుండానే ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధంకావడంపై వీరు గగ్గోలు పెడుతున్నారు.

కొత్త రూల్స్‌పై సోషల్‌మీడియా, ఓటీటీల గగ్గోలు

కొత్త రూల్స్‌పై సోషల్‌మీడియా, ఓటీటీల గగ్గోలు

తమను నియంత్రించేందుకు కేంద్రం తీసుకొస్తున్న కొత్త నిబందనలపై సోషల్‌ మీడియా సంస్ధలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఇంటర్నెట్ కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళ్తోందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో కేంద్రం విడుదల చేయాల్సిన నిబంధనల ప్రకటన ఆలస్యమవుతోంది. గత వారమే ఈ ప్రకటన వెలువడాల్సి ఉన్నా వీరి అభ్యంతరాలతో ఈ వారానికి వాయిదా పడింది. మరో రెండు రోజుల్లో కేంద్రం నుంచి కొత్త నిబంధనలపై ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సోషల్‌మీడియా, ఓటీటీలపై ఆంక్షలివే..

సోషల్‌మీడియా, ఓటీటీలపై ఆంక్షలివే..


కేంద్రం తీసుకొస్తున్న ఆంక్షల్లో ప్రధానంగా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ అవుతున్న ప్రతీ మెసేజ్‌నూ ట్రేస్‌ చేసేందుకు ఐటీ శాఖకు వీలు కల్పిస్తుంది. అలాగే తమపై వచ్చే ఫిర్యాదులపై సోషల్ మీడియా సంస్ధలు, ఓటీటీలు చర్యలు తీసుకునే సమయాన్ని 72 గంటల నుంచి 36 గంటలకు తగ్గిస్తున్నారు. కేంద్రం కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఇందులో షేర్‌ చేసే కంటెంట్‌ను సెన్సార్‌ చేసే అవకాశం కూడా కలుగుతుంది. తద్వారా అనుచితమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ ప్రజల్లోకి సులువుగా వ్యాప్తి కాకుండా అడ్డుకట్ట పడుతుంది.

English summary
The IT Ministry is looking to make changes to certain Sections to the IT Act to make social media intermediaries and over-the-top (OTT) platforms more accountable for the content shared through their platforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X