వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం సంచలన నిర్ణయం, అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లు! కేబినెట్ ఆమోదం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 10 శాతం రిజర్వేషన్ల పెంపుకు కేంద్ర కేబినెట్ సోమవారం నాడు ఆమోదం తెలిపింది.

Centre plans for 10 percent reservation to upper castes ahead of Lok Sabha polls

విద్య, ఉద్యోగాలలో ఆర్థికంగా వెనుకబడిన కులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లను 50 శాతం నుంచి 60 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రకుల పేదలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించనుంది.

రేపు (మంగళవారం) లోకసభలో అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉన్న వారు దీనికి అర్హులు. అలాగే, ఐదు ఎకరాల కంటే తక్కువ పొలం ఉన్న వారు రిజర్వేషన్లకు అర్హులు. వెయ్యి చదరపు అడుగుల ఇంటిస్థలం ఉంటే రిజర్వేషన్లకు అనర్హులు.

English summary
Ahead of the General elections this year, the government has announced reservation in jobs for those belonging to the upper castes and earning less than Rs 8 lakh per year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X