వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారానికి 4 రోజులే పనిదినాలు -మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ -కార్మిక చట్టాల్లో ప్రతిపాదన

|
Google Oneindia TeluguNews

''వారం ఐదునాళ్ళు శ్రమకే జీవితం.. వారం రెండునాళ్ళు ప్రకృతికంకితం.. శని ఆది వారాల్లేవని అన్నవి.. మనుషుల్ని మిషన్లు కావొద్దన్నవి..'' అంటూ అప్పట్లో 'జీన్స్' సినిమా కోసం లెజెండ్ ఏఆర్ రెహమాన్ స్వరపర్చిన 'కొలంబస్' పాటను ఇప్పుడు ఇండియాలో.. ఇంకాస్త సరదాగా.. మరో రోజును అదనంగా కలిపేసుకుని పాడుకోవచ్చు.. 'వారం నాలుగు నాలుగు నాళ్లు శ్రమకే అంకితం.. వారం మూడు నాళ్లు ఇక మన ఇష్టం..'అని మార్చేసుకోవచ్చు. ఎందుకంటే.. మోదీ సర్కార్ తాజాగా ఇలాంటి ప్రతిపాదనే చేసింది మరి..

కరోనా పుట్టుకపై అనూహ్య రిపోర్ట్ -వూహాన్ ల్యాబ్‌లో లీకేజీ వల్ల కాదన్న WHO -చైనా చెప్పిందే నిజం!కరోనా పుట్టుకపై అనూహ్య రిపోర్ట్ -వూహాన్ ల్యాబ్‌లో లీకేజీ వల్ల కాదన్న WHO -చైనా చెప్పిందే నిజం!

4 day work week

4 day work week

రాబోయే రోజుల్లో పని దినాలు నాలుగు రోజులకే కుదించుకునే వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక సంకేతాలిచ్చింది. కొత్తగా తీసుకువస్తోన్న కార్మిక చట్టాల్లో ఈ 4 day work week(వారంలో 4 రోజులే పనిదినాలు) అంశాన్ని పొందుపర్చినట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర సోమవారం అధికారికంగా ప్రకటించారు. మన దేశంలో సరికొత్తదయిన ఈ నియమం ప్రకారం..

దేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామదేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామ

పని గంటల్లో తేడా ఉండదండీ..

పని గంటల్లో తేడా ఉండదండీ..

పేరుకు పనిదినాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయా సంస్థల ప్రొడక్టివిటీ దృష్ట్యా పని గంటల్లో కోతలు మాత్రం ఉండబోవన్నది సుస్పష్టం. వారంలో నాలుగు రోజుల పని దినాలను మొత్తంగా 48 గంటల పరిమితికి మించకుండా అమలు చేసుకునే వీలును కేంద్రం కల్పించనుంది. ఇది మూడు రకాలుగా ఉండబోతోంది. వారంలో నాలుగు రోజుల పని దినాలైతే 12 గంటల పరిమితితో అమలు చేయవచ్చు, ఐదు రోజుల పని దినాలు అయితే 10 గంటల పరిమితితో అమలు చేసుకోవచ్చు, ఇక ఆరు రోజుల పని దినాలు అయితే 8 గంటల పరిమితి అమలు చేయవచ్చు. ప్రస్తతం..

కంపెనీలు, ఉద్యోగుల ఇష్టం..

కంపెనీలు, ఉద్యోగుల ఇష్టం..


దేశంలోని చాలా కంపెనీల్లోఆరు రోజుల పని దినాలు అమలవుతుండగా, ఐదు రోజుల పని దినాల సంస్థల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కాగా, కొత్త చట్టాలు అమలులోకి వస్తే నాలుగు రోజుల పని దినాలకు మార్పులు చేసుకోవచ్చు. అయితే ఈ మార్పు అనేది తప్పనిసరి కాదని, అన్ని కంపెనీలు విధిగా 4 day work weekను అమలు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేయబోదని, ఆయా యాజమాన్యాలు, అందులో పనిచేస్తోన్న కార్మికులు లేదా ఉద్యోగుల ఇష్టాల మేరకే అమలు చేసుకోవచ్చని అపూర్వ చంద్ర పేర్కొన్నారు. ఇక..

త్వరలోనే బిల్లు రూపకల్పన..

త్వరలోనే బిల్లు రూపకల్పన..

దేశంలో వారానికి నాలుగు రోజుల పనిదినాల అంశం ప్రస్తుతానికి ప్రతిపాదన దశలో మాత్రమే ఉందని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర పేర్కొన్నారు. ''ఇండియాలో పని విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు ఈ ప్రతిపాదనలు చేశాం. అయితే బిల్లు రూపకల్పన ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాం'' అని చెప్పారు. అంతేకాదు..

అందరికీ ప్రధాని సురక్షా బీమా..

అందరికీ ప్రధాని సురక్షా బీమా..

కొత్త కార్మిక చట్టాలు, నాలుగు రోజుల పనిదినాల నియమాల రూపకల్పనలో ఎక్కువ మంది సూచనలు తీసుకుంటున్నామని, వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు సామాజిక భద్రత అనే నాలుగు ప్రధాన అంశాలతో ప్రస్తుత నియమాలను రూపొందిస్తున్నామని అపూర్వ చంద్ర చెప్పారు. దీనిపై ఈ జూన్‌లో ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువస్తామన్న ఆయన.. అసంఘటిత కార్మికులు, రోజువారి కూలీలు, వలస కూలీలతో పాటు ఇతర వర్కర్ల రిజిస్ట్రేషన్‌కు ఇది తోడ్పడుతుందని చెప్పారు. ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నవారికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద తగిన సదుపాయాలు కల్పిస్తామని వివరించారు.

English summary
The Centre under its new labour codes would soon provide an option for organisations to allow their employees to work for four days in a week. Union labour secretary Apurva Chandra said on Monday this provision will comprise a work limit of 48 hours per week, adding that organisations would have three choices - deploying employees for four days at 12 hours per day, five days at around 10 hours per day and six days at eight hours per day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X